ఇటీవల హీరో రాజశేఖర్ కరోనా బారినపడి హాస్పిటల్ చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాజశేఖర్ పూర్తిగా కోలుకొని హాస్పిటల్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. హాస్పిటల్ లో చేరినప్పటినుండి కుటుంబ సభ్యులు రాజశేఖర్ ఆరోగ్యం గురించి ఎల్లప్పుడూ అభిమానులకి అప్డేట్ లు ఇస్తూవున్నారు. ఈరోజు సాయంత్రం అభిమానులకి శుభవార్త అందించారు.అయన పూర్తి కోలుకుని డిశ్చార్జ్ అయిన సందర్బంగా జీవిత రాజశేఖర్ హాస్పిటల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు.