పోలీసుల ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడిన అబ్దుల్ సలాం కుటుంబంకు సరైన న్యాయం జరగాలంటూ టీడీపీ డిమాండ్ చేసింది. తాజాగా చలో అసెంబ్లీ ద్వారా నిరసన చేపట్టింది. ఇటీవల నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్నది తెలిసిందే. దొంగతనం కేసులో పోలీసులు చేసిన ఒత్తిడి భరించలేకనే బలవన్మరణం పాల్పడినట్టుగా సెల్ఫీవీడియో బయటకు వచ్చింది. ఇది క్రమంగా రాజకీయ దుమారానికి కారణమైంది. బీజేపీ అద్యక్షుడు సోము వీర్రాజు కూడా పోలీసులను సస్పెండ్ చేయటం తప్పుబట్టారు. వైసీపీ సర్కారు స్పందించిన పోలీసులను సస్పెండ్ చేసింది. స్వయంగా సీఎం జగన్ వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు. కానీ.. టీడీపీ మాత్రం నిరసన తెలియజేస్తూనే ఉంది. నంద్యాల అబ్దుల్ సలాం కుటుంబ ఆత్మహత్యలపై సి.బి.ఐ దర్యాప్తు వేయాలని ఈరోజు ముస్లిం, బీసీ, ఎస్సీ, ఎస్టీ తదితర సంఘాలను కలుపుకొని తెలుగుదేశం పార్టీ గుంటూరు తూర్పు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించింది. చలో అసెంబ్లీను అడ్డుకొన్న పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేశారు.