పవన్‌కళ్యాణ్.. సినీ రంగంలో ఎంతోమందికి స్పూర్తి. శత్రువులు ఎన్ని రకాలుగా ఆయన ప్రతిష్ఠ దెబ్బతీయాలని ప్రయత్నించినా తరగని అభిమానులు ఆయనకు బలం. దృఢసంకల్పం ఉన్న నాయకుడుగా జనసైనికులు బలంగా నమ్ముతుంటారు. 1996లో మెగాస్టార్ తమ్ముడుగా వెండితెరకు పరిచయం అయిన పవన్ చేసింది కొన్ని సినిమాలే. వరుస ప్లాప్‌లు ఎదురైనా ఎక్కడా మనోనిబ్బరం కోల్పోలేదు. ఒక్క అబిమాని కూడా నిరూత్సాహ పడలేదు. పవన్ తొలిప్రేమ చూసి ఎంతోమంది సినిమా రంగానికి వచ్చారు. కేవలం ఆయన మేనరిజమ్స్ కోసమే సినిమాకు వచ్చేవారు కోట్లాది మంది. బిడ్డల ఆకలి అమ్మ కళ్లకు తెలుస్తుందంటారు.. తన చుట్టూ ఉన్నవారు కష్టాల్లో ఉన్నారంటే.. పవర్‌స్టార్‌లోని అమ్మతనం బయటకు వస్తుంది. గుప్తధానాల్లో అన్నయ్య చిరంజీవిని మించిన తమ్ముడు పవన్. రాజకీయాల్లోకి రాగానే ఆయనను కీర్తించిన నోళ్లన్నీ విమర్ళలు కురిపించటం మొదలుపెట్టాయి. అప్పటికి కానీ.. ఆయన కులం ఏమిటనేది వారికి గుర్తుకురాలేదు. 2014లో టీడీపీను గెలిపించటంలో కీలకంగా వ్యవహరించిన పవన్ ఆ తరువాత తెలుగుదేశం పార్టీ ఆఫ్ట్రాల్ పవన్ ఆయన లేకపోతే మేం గెలవలేమా అనేంతగా నోరుపారేసుకున్నారు. వైసీపీ కూడా పవన్ తెలుగుదేశం పార్టీ దత్తపుత్రుడంటూ ప్రచారం చేసి.. జనాల్లో టీడీపీ వ్యతిరేకతను తెలివిగా తమవైపునకు తిప్పుకున్నారు. కానీ.. పవన్ ఎవరితో తనకు వ్యక్తిగత ద్వేషం లేదంటూ చెప్పారు. అయినా.. రాంగోపాల్ వర్మ అనే ఒక పర్వర్టెడ్ దర్శకుడుతో పవన్‌పై అవాకులు.. చెవాకులు పేల్చుతూ వస్తున్నారు. ఎన్నికలు ముగిసి ఏడాది పూర్తయ్యాక.. ది గ్రేట్ వర్మకు పవన్ గుర్తుకు వచ్చాడు. పవన్‌కళ్యాణ్ ఎన్నికల తరువాత ఎలా ఉండొచ్చనే ఊహతో పవర్‌స్టార్ పై
ప్రతీకారం తీర్చుకునేందుకు సినిమా మొదలుపెట్టాడు. దానికి టైటిల్ కూడా పవర్‌స్టార్ అనే తగిలించాడు. ఇలా.. కేవలం ఒకే సామాజికవర్గాన్ని లక్ష్యంగా చేసుకుని అప్పుడు వంగవీటి సినిమా తీశాడంటూ కాపులు మండిపడ్డారు. మళ్లీ ఇపుడు పవన్‌కళ్యాణ్‌ను బద్నాం చేసేందుకు మరోసారి పవన్ చుట్టూ కథ అల్లాడంటున్నారు. గతంలోనూ ఇదే వర్మ మెగాస్టార్ చిరంజీవి
ఖైదీనెంబర్ 150 సినిమాను ఉద్దేశించి ఘాటైన కామెంట్స్ చేశాడు. అదొక అద్భుతమైన కళాఖండమంటూ ఎద్దేవాచేశాడు. దీనిపై
నాగబాబు ఘాటుగానే స్పందించాడు. ఇప్పుడు నందమూరి వర్సెస్ మెగాస్టార్ కుటుంబాల మధ్య రచ్చ జరుగుతున్నవేళ వర్మ
పవర్‌స్టార్ గురించి తీయబోతున్న సినిమా గురించి తరచూ ట్వీట్లు చేస్తున్నాడు. టీజర్స్ ద్వారా పవన్ అభిమానులకు కోపాన్ని..
వ్యతిరేకులకు ఆనందాన్ని పంచుతున్నాడు. మరి.. వర్మకు పవన్ అన్నా.. ఆయన సామాజికవర్గం అన్నా ఎందుకంత కోపం అనేది మాత్రం.. ఆయనకే తెలియాలి.