కరోనా వ్యాప్తితో తెలంగాణలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. చిన్నపాటి జలుబు చేసినా హడలెత్తాల్సి వస్తోంది. ఎంత జాగ్రత్తగా ఉంటున్నా.. ఏదో ఒక వైపు నుంచి ప్రమాదం తప్పదనే వాతావరణం కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో వైద్య ఆరోగ్యశాఖ పక్కా ఏర్పాట్లు చేసింది. కొవిడ్ కాల్‌సెంటర్ ద్వారా 24 గంటలూ వైద్యుల సేవలు అందిస్తుంది. ఇప్పటి వరకూ కేవలం 104 ద్వారా మాత్రమే.. కరోనా, ఇతర వ్యాధులతో బాధపడేవారికి అవసరమైన వైద్యసలహాలు ఇస్తున్నారు. ఇప్పుడు.. టోల్‌ఫ్రీనెంబరు ద్వారా ఒక్క పోన్‌కాల్‌తో ఐసొలేషన్‌లో ఉన్నబాధితులకు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి. ఎటువంటి ఆహారం తినాలి. మందులు ఎలా వేసుకోవాలనే జాగ్రత్తలు చెబుతున్నారు. అత్యవసరమైన వేళ.. 108 వాహనాన్ని బాధితుల ఇంటి వద్దకు కూడా పంపేదుకు చర్యలు తీసుకుంటారు.. కాబట్టి.. వైరస్ సోకినపుడు ఏ మాత్రం అధైర్యపడకుండా.. ఒక్క ఫోన్‌కాల్ ఈ నెంబరుకు చేయండి.. 18005994455