2019 ఎన్నికల సమయంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు.. స్వయానా జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య. టీడీపీ చేయించినట్టుగా వైసీపీ.. కాదు కాదు.. బాబాయి హత్యతో సానుభూతి కోసం జగన్ చేయించాడని టీడీపీ పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే ఏమో కానీ. వైసీపీ గద్దెనెక్కారు. అంతే.. ఇంకేముంది.. బాబాయిను దారుణంగా హత్య చేసిన వారికి దబ్బిడి దిబ్బిడే అని అందరూ భావించారు. కానీ. అవేమీ జరగలేదు . కడప, కర్నూలు జిల్లాల్లో పోలీసు అధికారులు మాత్రం బదిలీ అయ్యారు. ఇక ఈ కేసు ఇప్పట్ల తేలనట్టే అనే నిర్ణయానికి వచ్చారు. ఇటువంటి సమయంలో వివేకా భార్య, కూతురు హత్య వెనుక సూత్రదారుల గుట్టు తేల్చేందుకు సీబీఐ దర్యాప్తు కావాలంటూ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఇంత హంగామా జరిగినా రెండేళ్ల వ్యవధిలో కేసు కొలిక్కిరాలేదు. పైగా కేసు వాపసు తీసుకోమంటూ.. సీమలో ఈ తరహా హత్యా రాజకీయాలు సాధారణమంటూ వివేకా కుటుంబంపై ఒత్తిడి కూడా పెరిగిందట. ఈ నేపథ్యంలోనే వైఎస్ సునీతారెడ్డి అదేనండీ వివేకా కూతురు ధిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. బాబాయి హత్యపై జగన్,
షర్మిల ఎందుకు స్పందించట్లేదనేది వారిని అడగమంటూ మీడియాకే ఝలక్ ఇచ్చారు సునీతారెడ్డి. ఈ లెక్కన ఎటుచూసినా కేసు విచారణ, దర్యాప్తులో ఆలస్యం వెనుక అయినవారే ఉన్నారనే విషయాన్ని సునీతారెడ్డి చెప్పకన చెప్పినట్టయింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై షర్మిల, ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి మౌనం వీడి ఎలా స్పందిస్తారు.. ఏ విధంగా బాబాయి హత్యను ఖండించారో.. అదే విధంగా దోషులను గుర్తించి శిక్షపడేలా చేస్తారనది ఆసక్తిగా మారింది.



