మాస్‌లో మాంచి ఇమేజ్.. ఫ్యాన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఉన్న నటుడు బాలకృష్ణ. నందమూరి అందగాడు. నటసార్వభౌముడు నందమూరి తారకరామారావుకు అసలు సిసలైన నటవారసుడు. రాజకీయంగా కూడా ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తున్న నటసింహం. 61 వ పుట్టినరోజు… ఫ్యాన్స్‌కు గొప్ప కాను క ఇచ్చారు. మలినేని గోపిచంద్ దర్శకత్వంలో 107వ సినిమా పోస్టర్‌తో మజా పంచారు. సాహసమే జీవితమంటూ.. హీరోగా వెండితెరకు పరిచయమైన బాలయ్య.. కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలైన మంగమ్మగారి మనువడుతో సూపర్‌డూపర్ హిట్ అందుకున్నారు. 105 సినిమాలు చేశారు. 106వ సినిమా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో చేస్తున్నారు. అఖండగా ఇటీవల విడుదలైన టీజర్ దుమ్మురేపింది. మాస్‌లో బాలయ్య స్థానం ఎలా ఉంటుందో మరోసారి చాటుకుంది. ఎన్టీఆర్ జీవితచరిత్రను తీసి కాస్త వెనుకబడిన బాలయ్య ఆశలన్నీ బోయపాటి సినిమాపైనే ఉన్నాయి. లెజెండ్, సింహాతో రికార్డులు తిరగరాసిన బాలయ్య, బోయపాటి హ్యాట్రిక్ కొడతారనే ధీమాగా ఉన్నారు. ఎంత ఇమేజ్ ఉన్నా బాలయ్య కూడా తరచూ నోరుజారటం. చేయిజారటం వంటివి పంటికింద రాయిలా ఇబ్బందిగానే అనిపిస్తుంటాయి. తోటి హీరోల పట్ల చులకన ధోరణి కూడా కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. అయినా.. బాలయ్య మనసు పసిపిల్లాడి మనస్తత్వంగానే సహ నటులు భావిస్తుంటారు. ఎన్టీఆర్ తనయుడుగా బాలయ్యకు గౌరవం ఇస్తూనే ఉన్నారు. రాజకీయంగా కూడా తనదైన ముద్ర వేసుకున్న బాలయ్య.. మరింత ఉన్నతంగా ఎదగాలని.. రాజకీయంగా.. సినీ రంగంలోనూ మరిన్ని విజయాలు సాధించాలని కదలిక టీమ్ కోరుకుంటుంది. పుట్టిన రోజుశుభాకాంక్షలు చెబుతుంది. జై బాలయ్య.. జైజై బాలయ్య.



