మెగాప‌వ‌ర్ స్టార్ కోసం.. 231 కి.మీ వాక్‌!

మెగాస్టార్ కుటుంబం .. కోట్లాది మంది ప్రేమాభిమానాలు అందుకుంటుంది. డ‌జ‌ను మంది హీరోలున్నా.. అంద‌ర్నీ స‌మంగా భావించ‌ట‌మే వీర ప్ర‌త్యేక‌త‌. కొన్నిసార్లు అతిగా అనిపించినా చిరంజీవి నుంచి అల్లు అర్జున్ వ‌ర‌కూ ఎవ‌రి సినిమా విడుద‌లైనా ఫ్యాన్స్ అంద‌కూ ఒక్క‌ట‌వుతారు. ఇదంతా ఇప్పుడెందుకంటే.. మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ను చూసేందుకు వీరేష్‌, జ‌య‌రాజ్‌, ర‌వి అనే ముగ్గురు అభిమానులు జోగులాంబ గ‌ద్వాల్ జిల్లా నుంచి హైద‌రాబాద్ వ‌ర‌కూ న‌డ‌క‌సాగించారు. 4 రోజుల‌పాటు 231 కి.మీ దూరం వాకింగ్ తో చేరారు. కొవిడ్ స‌మ‌యంలో ఎందుకింత ప్ర‌యాస‌ప‌డ్డారంటూ చెర్రీ కూడా ఆ ముగ్గురిని సున్నితంగా మందలించారు. వారి అభిమానాన్ని వెల‌క‌ట్ట‌లేమంటూ.. ద‌గ్గ‌రకు తీసుకుని హ‌గ్ చేసుకున్నారు. ఇంటికెళ్లాక‌.. ఫోన్ చేయ‌మంటూ స్వ‌యంగా త‌న నెంబ‌రు ఇచ్చారు. చిరంజీవి త‌న‌యుడుగా చెర్రీ చిరుత‌గా ప‌రిచ‌య‌మైనా.. త‌న‌కంటూ ప్ర‌త్యేక ఇమేజ్ తండ్రిబాట‌లో సేవానిర‌తితో ముందుకు వెళ్తున్నారు. తండ్రికి త‌గ్గ త‌న‌యుడుగా ముద్ర వేసుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here