వ్యాపారులకు తన సౌండ్ బాక్స్ ను ఉచితంగా అందించనున్న పేటీఎం మరిన్ని లావాదేవీలు చేస్తే ఆకర్షణీయమైన ప్రయోజనాలు

పేటీఎం సౌండ్ బాక్స్ ను ప్రభావపూరితంగా సున్నా వ్యయానికే పొందే అవకాశాన్ని దేశవ్యాప్తంగా వ్యాపారులకు అందిస్తున్నట్లు భారతదేశ అగ్రగామి డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వేదిక అయిన పేటీఎం నేడిక్కడ ప్రకటించింది. పేటీఎం సౌండ్ బాక్స్ నే పేటీఎం స్పీకర్ గా కూడా వ్యవహరిస్తుంటా రు. కంపెనీ ప్రస్తుతం దీన్ని పేటీఎం ఫర్ బిజినెస్ (పి4బి) ఉపయోగించి కొనుగోలు చేసిన వారికి 40 శాతం భారీ డిస్కౌంట్ తో రూ.299లకే అందిస్తోంది. అంతేగాకుండా వ్యాపారులు లేదా వ్యాపార సంస్థ ల యజమానులు ఒక్కో నెలలో 50 లావాదేవీలు గానుక నమోదు చేస్తే హామీ పూర్వక రూ.60 క్యాష్ బ్యాక్ ను ఐదు నెలల పాటు పొందగలుగుతారు. ఆ లెక్కన చూస్తే ఈ ఉపకరణం వారికి ఉచి తం గానే లభించినట్లు అవుతుంది.
డిజిటల్ లావాదేవీలు నిర్వహించేందుకు, ఆన్ లైన్ ద్వారా చెల్లింపులు చేసేందుకు, స్వీకరించేందుకు ఈ ఆఫర్ దేశవ్యాప్తంగా చిన్న వ్యాపారులకు తోడ్పడగలదని కంపెనీ విశ్వసిస్తోంది. ఈ ఆఫర్ దేశవ్యా ప్తంగా వ్యాపారులకు అందుబాటులో ఉంటుంది. దేశవ్యాప్తంగా పేటీఎం సౌండ్ బాక్స్ వినియోగం పెరిగిపోతోంది, ఎందుకంటే అది సులభంగా డిజిటల్ చెల్లింపులను ఆమోదిస్తుంది మరియు లావాదే వీలను ట్రాక్ చేయడంలో సహకరిస్తుంది. అంతేగాకుండా ఫేక్ స్క్రీన్స్, ఫేక్ కన్ఫర్మేషన్ చూసిస్తూ మోసం చేసే వారి బారి నుంచి కాపాడుతుంది. ఈ ఉపకరణం ఎన్నో ప్రాంతీయ భాషల్లో లభిస్తుంది, తద్వారా తమ మాతృభాషలో లావాదేవీ ధ్రువీకరణను పొందడంలో వారికి తోడ్పడుతుంది.
ఈ సందర్భంగా పేటీఎం అధికార ప్రతినిధి మాట్లాడుతూ, ‘‘దేశవ్యాప్తంగా వ్యాపారులకు సాధికారికత కల్పించడంలో మా విజయవంతమైన ఉపకరణాల్లో పేటీఎం ఒకటి. దీని యూజర్లు డిజిటల్ చెల్లింపు లపై విశ్వాసాన్ని పెంచుకోవడంలో ఇదెంతగానో తోడ్పడింది. ఈ ఆఫర్ ద్వారా మరింత మంది వ్యాపా రులు ఈ సేవలను పొందుతారని మేం ఆశిస్తున్నాం’’ అని అన్నారు.

Previous articleకామెడీ నేపథ్యంలో ‘ఎస్‌.కె’ (SK) చిత్రం ప్రారంభం
Next articleసీఎంను కలిసిన భీమనాదం భరత్ రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here