హైదరాబాద్ లో ఉన్న ELLYSIUM (ఎల్లీసియం) ఆటోమోటివ్స్, బ్రిటిష్ ఇ-మొబిలిటీ బ్రాండు వన్ మోటోతో తన సంబంధాన్ని రద్దు చేసుకుంటోంది

ELLYSIUM

2022 జూన్ నెలాఖరుకల్లా ELLYSIUM ఆటోమోటివ్స్, తాము సంపూర్ణంగా స్వంతం చేసుకున్న కొత్త స్మార్ట్ మొబిలిటీ బ్రాండును ప్రకటిస్తుందని ఆశించబడుతోంది.

హైదరాబాద్ లో ఉన్న ELLYSIUM ఆటోమోటివ్స్, బ్రిటిష్ ఆటోమోటివ్ బ్రాండు వన్ మోటో తో తన సాహచర్యమును రద్దు చేసుకుంటున్నట్లుగా నేడు ప్రకటించింది. ‘’భారత్ లో తయారీ’ స్ఫూర్తి నేపధ్యములో ఇండియాలో ఒక తయారీ విభాగాన్ని నెలకొల్పాలనే దిశగా నిర్ణయం తీసుకున్న ఈ బ్రాండుకు, బ్రిటిష్ ఎలెక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ నుండి ఆశించినంత మద్దతు లభించలేదు, తత్ఫలితంగా విడిపోవాలని నిర్ణయించుకుంది.

ELLYSIUM

అదనంగా, ELLYSIUM ఆటోమోటివ్స్, ఇండియాలో తయారీ ప్రణాళికలను కలిగి ఉండబోయే ఒక కొత్త ఇ-మొబిలిటీ బ్రాండును ప్రకటించడానికి కొత్త ప్రణాళికలను తెలియజేసింది, తద్వారా భారతీయ కస్టమర్ యొక్క ఆవశ్యకతల ప్రకారము నాణ్యత మరియు టెక్నాలజీని నియంత్రించడానికి దానికి వీలు కల్పిస్తోంది.

ఈ బ్రాండు సుస్థిరత దిశగా ఇదివరకే ప్రయత్నాలను ప్రారంభించినట్లుగా తెలుస్తోంది మరియు తయారీ కర్మాగారము యొక్క స్థాపన కొరకు భూమి కేటాయింపు కోసం తెలంగాణ ప్రభుత్వముతో సన్నిహితంగా పని చేయడం మొదలుపెట్టింది, నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయడం కోసం ఆ కర్మాగారం భారీ ఆటోమేషన్ ఇంటిగ్రేషన్, సెమీ-రోబోటిక్స్, మరియు అత్యుత్తమ తయారీ యంత్రపరికరాలతో సమృద్ధమై ఉండబోతోంది.

“భారతీయ విపణివీధిలో విద్యుత్ వాహనాల ప్రస్తుత సన్నివేశమును బట్టి, విద్యుత్ వాహనం పేరుతో రోడ్డు మీదికి ఏది ఏమి విడుదల చేయబోతున్నదో దగ్గరగా నిఘా వేసి చూడడం చాలా ముఖ్యమై పోయింది. అదనంగా, భారతీయ కస్టమర్లకు విద్యుత్ వాహనం ఇంకా ఒక కొత్త భావజాలమే అని అర్థం చేసుకుంటూ ధర విషయం కూడా చూసుకోవలసిన అవసరం ఉంది. ఇండియాలో ఒక తయారీదారు ఉంటే మాత్రమే ఇవన్నీ జరుగుతాయి, మరి దానినే మేము అందరికీ నచ్చజెప్పబోతున్నాము. కొత్త విద్యుత్ వాహన బ్రాండుచే ప్రవేశపెట్టబడే గొప్ప ఉత్పత్తులను కస్టమర్లు త్వరలోనే చూడబోతున్నారు, అందుకోసం మేము ఎటువంటి రాజీ పడకుండా లాంచ్ చేయడానికి సర్వం సిద్ధం చేశాము,” అన్నారు, ELLYSIUM ఆటోమోటివ్స్ ప్రొమోటర్ మరియు వ్యవస్థాపకులు శ్రీ ముజమ్మిల్ రియాజ్ గారు.

ELLYSIUM ఆటోమోటివ్స్ 2022 జూన్ ఆఖరు నాటికి కొత్త విద్యుత్ బ్రాండును ప్రకటిస్తుందని ఆశించబడుతోంది. ప్రారంభించబోయే కొత్త బ్రాండు క్రింద నడుస్తున్న ఈ ఆర్థిక సంవత్సరములో ఆశాదాయకంగా కనీసం 3 ఉత్పత్తులను ప్రకటించాలని అది లక్ష్యంగా చేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here