వ‌ర్మ వెనుక సీక్రెట్ షాడో!

ప‌దేళ్ల క్రితం ఒక ఎమ్మెల్యే వ్య‌క్తిగ‌త ప‌గ‌తో చిరంజీవిని తొలిసారి మాన‌సికంగా దెబ్బ‌తీశాడు. ప్ర‌జారాజ్యం పార్టీ స్థాపించిన నాటి నుంచి అంటే.. 2009 నుంచే మెగాఫ్యామిలీ చుట్టూ కాల‌నాగులు బుస‌లు కొడుతూనే ఉన్నాయి. చాలా మంది రాజ‌కీయ‌పార్టీలు పెట్టారు. ఎన్నిక‌ల్లో పోటీచేశారు. కానీ.. కేవ‌లం చిరంజీవి అనే ఒక్క ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేందుకు చేయాల్సింద‌ల్లా చేశారు. న‌మ్మ‌క‌స్తులు కూడా చిరు అమాయ‌క‌త్వాన్ని ఆస‌రా తీసుకుని మోస‌గించారు. అది గ‌తం… 2014కు ముందు ప‌వ‌న్ జ‌న‌సేన పార్టీతో 30 ఏళ్ల‌పాటు జ‌నం మ‌ధ్య‌లో ఉంటానంటూ రాజ‌కీయాల్లోకి వ‌చ్చాడు. తొలి స‌భ‌లోనే గెలుపోట‌ముల‌కు అతీతంగా నాతో క‌ల‌సి న‌డిచేవాళ్లు మాత్ర‌మే ఉండ‌మంటూ జ‌న‌సైనికుల‌కు పిలుపునిచ్చారు. కానీ.. 2019 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌ను ఇరుకున పెట్టేందుకు ఓ వ‌ర్గం.. పేద్ద కుట్ర ప‌న్నింది. ప‌వ‌న్ మావాడేనంటూ మ‌రో వ‌ర్గం ప్ర‌చారంచేసుకుంది. త‌మ చెప్పుచేత‌ల్లో వ్య‌క్తేనంటూ మ‌రీ చాప‌కింద‌నీరులా విష‌ప్ర‌చారంచేసింది. న‌టి శ్రీరెడ్డిని రంగంలోకి దింపి.. ప‌వ‌న్‌ను ఎంత వ‌ర‌కూ మాన‌సికంగా ఇబ్బందిపెట్టాలో అంత వ‌ర‌కూ చేశారు. 2020 ప‌వ‌ర్‌స్టార్‌.. ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత అంటూ వ‌ర్మ సినిమాను రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. ఇదంతా వాస్త‌వ‌మేనంటూ చెప్పేశాడు. పైగా తాను మెగాఫ్యామిలీకు వీరాభిమానినంటూ చెప్పుకుంటున్నాడు. ప‌వ‌న్ అంటే త‌న‌కెంతో ఇష్ట‌మ‌ని కూడా అనేశాడు. కానీ.. సినిమా పేరుతో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇమేజ్‌ను పూర్తిగా దెబ్బ‌తీసేందుకు కుట్ర‌కు రూప‌మిచ్చాడు. వ‌ర్మ‌కు ప‌వ‌న్ అంటే ఎందుకింత కోపం అనేది ప్ర‌శ్నార్థ‌కం. కానీ.. వ‌ర్మ వెనుక ఎవ‌రో కీల‌క‌మైన వ్య‌క్తులు షాడోలుగా మారి ఇదంతా చేయిస్తున్నారనే గుస‌గుస‌లు మాత్రం లేక‌పోలేదు. అయితే.. ఆ వ్య‌క్తి ఎవ‌రు?
రాజ‌కీయ‌నాయ‌కుడా.. సినీ న‌టుడా.. ఎవ‌రైనా బ‌డా పారిశ్రామిక‌వేత్తా! కానీ. ఎవ‌రో పెద్ద‌త‌లకాయ చాలా జాగ్ర‌త్త‌గా వ‌ర్మ‌ను
ముందునుంచి న‌డిపిస్తూ.. ప‌వ‌న్‌ను రాజ‌కీయాల‌నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు ప‌క్కా ప్లాన్ చేస్తున్నార‌నేది మాత్రం వాస్త‌వం అంటున్నారు ప‌వ‌న్ అభిమానులు. ఇప్ప‌టి బంజారాహిల్స్‌లోని వ‌ర్మ ఆఫీసుపై జ‌న‌సైనికులు దాడి చేశారు. దీనిపై కేసు న‌మోదుచేయ‌టం.. అరెస్టులు జ‌రిగాయి. దాడి చేసిన వాళ్ల‌కు వ‌ర్మ థ్యాంక్స్ చెప్పాడు. త‌న సినిమాకు ఫ్రీ ప‌బ్లిసిటీ అన్నాడు. మ‌రోవైపు అల్లు అర‌వింద్‌, ద‌గ్గుబాటి సురేష్ త‌మ పిల్ల‌లు అల్లు అర్జున్‌, రానా కోసం.. చాలా మంది టాలెంట్ ఉన్న‌వాళ్ల‌ను తొక్కేస్తున్నారంటూ.. త‌న‌తో ఓ త‌మిళ హీరో అన్నాడంటూ ఓ టీవీ ఛాన‌ల్ డిబేట్‌లో స్పందించాడు. ఇలా.. సినీ రంగంలోని పెద్ద‌ల‌ను ఇన్‌వాల్వు చేయ‌టం ద్వారా వ‌ర్మ ఏం సాధించాల‌ని అనుకుంటున్నాడ‌నేది ప్ర‌శ్నార్ద‌కం?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here