కాకతీయ- అపోలో విద్యాసంస్థల వారి వరద బాధితుల సహాయార్థం గత వారం రోజుల్లో కురిసిన భారీ వర్షాలకు , విజయవాడ చరిత్రలోఎప్పుడూ చవిచూడని ,బుడమేరు వరద ముంచెత్తిన వేళ, ఒక్కసారిగా అందరూ ఉసూరైన వేళ, ఎన్నో పేటలు, ఎన్నో కుటుంబాలు, అతలాకుతలమై, నేటికీ రాజరాజేశ్వరి పేట, జక్కంపూడి కాలనీ, వై. ఎస్. ఆర్ కాలనీ, మొదలగువాసులు, జలదిగ్బంధంలోనే ఉన్నారు. తక్షణమే స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, ఉప ముఖ్యమంత్రివర్యులు, అధికారులు, ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ప్రజాక్షేత్రంలో అహర్నిశలు శ్రమిస్తున్నారు.
దీనికి స్ఫూర్తిగా ది 5వ తారీకు అనగా గురువారంస్థానిక నందిగామ కాకతీయ అపోలో విద్యా సంస్థలు, మేనేజ్మెంట్ వారి సహాయం తో పాటు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రుల నుండి సేకరించిన ఒక 1,50,000 రూపాయలు, విలువచేసే బియ్యం, కందిపప్పు, నూనె, సబ్బులు, పేస్టులు, వాటర్ బాటిల్స్, బిస్కెట్లు, దుస్తులను, ఒక లారీలో విజయవాడ తీసుకువెళ్లి, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పంపిణీ చేయడం జరిగినది.
కొన్ని దీనస్థితిలో ఉన్న ప్రాంతాలకు, వెళ్లడానికి, నీరు ఉన్నందువల్ల వెళ్లలేక వాటిని, 8వ తారీకు, అనగా ఆదివారం రోజున పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ సహాయ ఉద్యమంలో సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థులకు, మిత్రులకు, వ్యాపారస్తులకు, SFI వారికి కాకతీయ – అపోలో విద్యాసంస్థలు కృతజ్ఞతా పూర్వక అభినందనలు తెలియచేసుకుంటున్నాం.
వర్షం రోజున, విజయవాడ రహదారి పై, ఐతవరం వద్ద, రాకపోకలు నిలిచిపోయినప్పుడు కూడా ఎంతోమందికి పులిహార ప్యాకెట్స్, అందించడంతోపాటు మధ్యాహ్నం భోజనాల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాకతీయ -అపోలో విద్యాసంస్థలు, వారి తల్లిదండ్రులు, సేవాభావాన్ని చాటుకున్నారు.