ర‌ఘురామా.. ఏందీ ఇంత మాట‌నేశా!

కూటీల పాలు పోయినోడు కాటిల గేదెను క‌ట్టేసినాడంటా! ఉత్త‌రాంధ్ర‌లో వాడుక‌లో ఉండే సామెత‌. అమ్మకు అన్నం పెట్ట‌డు కానీ.. పిన్న‌మ్మ‌కు బంగారు గాజులు చేయిస్తాడంట‌.. అంటూ తెలుగు నాట ఎక‌సికాలాడేవారు. ఇప్పుడెందుకీ సామెత‌ల గోల అనుకునేరు. న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు.. బెట్టువీడ‌డు. మెట్టుదిగ‌డు. క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌రెడ్లు పాగా వేసినంత ఈజీకాదు.. మా రాజుల ఇలాఖాలో రాజ‌కీయాల‌నేంత‌గా దిక్క‌రిస్తున్నాడు. పైగా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం సాష్ఠాంగ‌ప‌డి.. మీ ద‌య‌వ‌ల్ల‌నే మేమంతా గెలిచామంటూ.. పొర్లుదండాలు పెడుతున్నారు. అంత‌టి స‌త్తాగ‌ల జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి అంటే.. పంచెలో చిన్న దారంతో స‌మానం అనేంత‌గా ర‌ఘురాముడు తీసేస్తున్నాడు. బాణం ఒక్క‌టే లేదుకానీ.. అస్త్రశ‌స్త్ర ప్ర‌యోగాల‌న్నీ వైసీపీ స‌ర్కారుపై చేశాడు. ఏడాదిలో ర‌ఘురామ కృష్ణంరాజు ఎందుకిలా మారాడో తెలియ‌దు కానీ.. జ‌గ‌న్ అంటే ఒంటికాలిపై లేస్తున్నాడు. అందాకా ఎందుకు.. స్వ‌ప‌క్ష నేత‌ల‌కు.. విప‌క్ష నాయ‌కుల‌కూ.. ట్వీట్ల‌తోనే బుద్దిచెప్పే విజ‌యసాయిరెడ్డి కూడా ర‌ఘురాముడు జోలికి ఎలా వెళ్ల‌ట‌మా! అంటూ సైలెంట‌య్యారు. పార్టీ దిక్కారం కింద నోటీసు పంపితే.. అబ్బే అది నాలుక గీసుకోవ‌టానికి కూడా ప‌నికిరాదు. అయినా నేను గెలిసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటూ.. యువ‌జ‌న శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కానీ.. నాకు వైసీపీ పేరుతో ఎవరో షాకాజ్ నోటీసు ఇచ్చారంటూ ఎదురుతిరిగాడు. అస‌లు మా పార్టీ నుంచి నోటీసే అంద‌లేదంటూ.. ప‌దిపేజీల లేఖ రాశాడాయె! ఏదో విధంగా ఆయ‌న్ను దారికి తెద్దామ‌ని.. చ‌ట్టాల‌న్నీ వెతికేప‌నిలో వైసీపీ న్యాయ‌కోవిధులు ప‌డ్డార‌ట‌. మ‌రి అప్ప‌టి వ‌ర‌కూ ర‌ఘురాముడు ఆగుతాడా! క‌రోనా టెస్ట్‌ల్లో మేమే టాప్ అంటూ వైసీపీ నేత‌లు
జ‌బ్బ‌లు చ‌రచుకుంటుంటుంటే.. ర‌ఘురాముడు మాత్రం.. అబ్బే జ‌గ‌న్ పేరు యావ త‌ప్ప అక్క‌డేం లేదంటూ ఒక్క‌దెబ్బ‌కు గాలితీశాడు. పైగా క‌రోనా ముందు జ‌గ‌న్ పేరు త‌గిలించుకుని క‌నీసం వైద్యం చేయ‌మంటూ చుర‌క‌లేశాడు. ప‌థ‌కాల‌కు జ‌గ‌న్ పేరును ఎద్దేవాచేస్తూనే. క‌రోనా వేళ వైసీపీ తీరు అబ్బేం ఏం బాగాలేదంటూ ఏడాదిన్న‌ర పాల‌న‌ను ఒక్క‌మాట‌తో దెబ్బేశాడు. అటు మోదీను ఆకాశానికి ఎత్తుతూ.. ఇటు త‌మ అధినేత‌ను పాతాళానికి వంచుతూ.. ర‌ఘురాముడు ఏం చేయాల‌నుకుంటున్నాడ‌నేది మాత్రం ష్‌.. గ‌ప్‌చుప్‌!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here