చింతచచ్చినా పులుపు పోలేదంటే ఇదేనేమో.. ! కాంగ్రెస్‌లో ఓన్లీ ఒన్ సీనియర్ లీడర్. అస్సలు సీఎం కావాల్సుండే.. కానీ పక్కోళ్లు గుంజకపోయిరు అంటాడు. కేసీఆర్, వైఎస్సార్, చంద్రబాబు వీళ్లంతా నా ముందు పిల్లలంటాడు. చమత్కారం.. కాస్త వెటకారం.. మరింత అమాయకత్వం జోడించి మాట్లాడే కాంగ్రెస్ లీడర్ వి.హనుమంతరావు. అందరూ ముద్దుగా హన్మంతన్న.. వీహెచ్ అంటుంటారు. కానీ.. ఆయనకు మాత్రం.. పీసీసీ అధ్యక్షుడు కావాలనే చాలా కోరికుంది. కానీ.. వయోభారం.. కాస్త కేడర్ కూడా లేకపోవటంతో అదిష్ఠానం కూడా ఆయన వైపు చూడట్లేదు. దీంతో ఎలాగైనా సరే పీసీసీ పీఠం దక్కించుకోవాలనే ఊపుతో.. ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నాడు. ఈ మధ్యనే కరోనా వైరస్‌కు గురై.. కొద్దిరోజులు అపోలోలో చికిత్స కూడా తీసుకున్నాడు. ఆ వయసులో వైరస్‌ను ఎదిరించి ఆరోగ్యంగా బయటపడ్డాడు. కానీ.. మళ్లీ పోరుబాట అంటూ. తాజాగా ఉస్మానియా ఆసుపత్రి వద్ద లొల్లి మొదలుపెట్టే. అస్సలే వైరస్ విజృంభిస్తుందన్నా.. అని చెప్పినా.. నెత్తీనోరు మొత్తుకున్నా వినట్లేదట. దీంతో ఆయన తిరిగే ఆ కాస్త మంది కూడా ఉలిక్కిపడుతున్నారట. మనకెందుకే.. కొద్దిరోజులు సైలెంట్ అవుదామన్నా.. మా పెద్దాయన వినట్లేదంటూ బోరుమంటున్నారట.