శ్రీవారిని దర్శించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా

నేడు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు అంతా కలిసి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అలాగే దర్శనం అనంతరం ఆలయంలోనే రంగనాయకుల మండపం నందు వారికి వేద పండితులంతా కలిసి వేద ఆశీర్వచనం చేసి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా రాఘవ్ చద్దా మాట్లాడుతూ తనకు స్వామివారిని దర్శించుకోవడం అనేది చాలా సంతోషకరంగా ఉందని, స్వామివారిని చూసినప్పుడు ఆయనకు ఎంతో మనశ్శాంతి కలుగుతుందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఆయనను ఎంతో ప్రేమగా చూసుకుని ఆశీర్వాదాలు ఇచ్చిన వేద పండితులు అందరికీ ఆయన తన నమస్కారాలు తెలియజేశారు.

Previous articleరోగుల కోసం మొబైల్లోనే ఓపీ బుక్ చేసుకునే అవకాశం – ఈ నెల 15న ప్రారంభం కానున్న “ఈ-ఆశా” యాప్
Next articleఘనంగా ప్రభుత్వ సారాయి దుకాణం టీజర్ లాంచ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here