శ్రీమతి పులిజాల నరసమ్మ సమర్పణలో పులిజాల ఫిల్మ్స్ పతాకంపై ప్రీతి నిగమ్, రామ్, భాను ప్రసాద్, సురేష్ రాజ్, బ్రహ్మానందం రెడ్డి నటీ నటులుగా జయశేఖర్ కల్లు. దర్శకత్వంలో పులిజాల సురేష్ నిర్మించిన చిత్రం “రాబందు”. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం ఘనంగా జరుపుకున్నారు.సినిమాటోగ్రఫి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ట్రైలర్ రిలీజ్ చేసి యూనిట్ అభినందనలు తెలియచేశారు. అనంతరం గెస్ట్ గా వచ్చిన దర్శకుడు సముద్ర లిరికల్ సాంగ్ ను విడుదల చేయగా చిత్ర నటి ప్ర్రీతి నిగమ్ టీజర్ లాంచ్ చేశారు.ఇంకా సెన్సార్ బోర్డు మెంబర్ ఉపేంద్ర , రేణుకుమార్ మరియు చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం
నటి ప్ర్రీతి నిగమ్ మాట్లాడుతూ..ట్రైలర్ చూస్తుంటే నాకు గూస్ బమ్స్ వచ్చాయి. అంత బాగా ఉంది. రాబందు అనే పక్షి ఎంత పట్టుదలతో ఉంటుందో ఈ సినిమా స్టోరీలో కూడా అదే పట్టుదలే కనిపిస్తుంది. ముఖ్యంగా మా డైరెక్టర్ & ప్రొడ్యూసర్ గారికి కాంగ్రాచులేషన్స్ చెప్పాలి, ఎందుకంటే ఒక సినిమా తీయాలి అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. తన కష్టార్జితాన్ని మొత్తం సినిమా కోసం పెట్టడం అనేది ఒక చాలా ధైర్యం కావాలి. ఆలా సినిమా మీదున్న ప్యాషన్ తో మంచి సినిమా తీసిన ఇలాంటి ప్రొడ్యూసర్స్ ని డెఫినెట్ గా ఎంకరేజ్ చేయాలి. నేను ప్రేక్షకులందరినీ చెప్పేది ఏంటంటే, దయచేసి సినిమా థియేటర్ కి వెళ్లి సినిమా చూడండి ఆదరించండి. అప్పుడు మీ జడ్జిమెంట్ ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. డెఫినెట్ గా ఒక మంచి సినిమా చూశామన్న ఫీల్ కలుగుతుందని కచ్చితంగా చెప్పగలను అన్నారు .
ప్రముఖ దర్శకుడు సముద్ర మాట్లాడుతూ..డైరెక్టర్ జయశేఖర్ నాకు మంచి మిత్రుడు..పూర్తిగా క్రైమ్ ఎంటర్టైన్మెంట్ గా వస్తున్న ఈ సినిమా తనకిది నాలుగో సినిమా. యానిమల్ సినిమా లాగా రాబందు టైటిల్ చాలా మాస్ ఉంది. టైటిల్ లాగే ఈ సినిమా కూడా వైలెంట్ గా ఉంటుందనుకుంటున్నాను. ఇందులో నటించిన ప్రీతి గారికి, మా జూనియర్ రాజశేఖర్ ఇలా ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి ఈ సినిమా మంచి లైఫ్ ఇవ్వాలని ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ గారికి మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
చిత్ర నిర్మాత పులిజాల సురేష్ మాట్లాడుతూ.. మా చిత్ర ట్రైలర్ ను విడుదల చేసిన సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, లిరికల్ సాంగ్ ను విడుదల చేసిన సముద్ర గారికి, టీజర్ ను విడుదల చేసిన ప్రీతీ నిగమ్ గారికి ధన్యవాదములు. మంచి కథతో ఒక సందేసాత్మకంగా తీసిన ఈ సినిమాను దర్శకుడు జయశేఖర్ చాలా బాగా తెరాకెక్కించాడు. అనుకున్న దానికంటే సినిమా చాలా బాగా వచ్చించి. త్వరలో విడుదల అవుతున్న మా చిత్రాన్ని హిట్ చేయాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు..
చిత్ర దర్శకులు జయశేఖర్ కల్లు మాట్లాడుతూ.. నేటిసమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలన ఆధారంగా భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో పులిజాల ఫిలిమ్స్ బ్యానర్ మీద మేము నిర్మించిన చిత్రం రాబందు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రిలీజ్ కి సిద్ధంగా ఉంది. మా చిత్ర ట్రైలర్ ను సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చేతుల మీదుగా విడుదల చేసి మాకాయన ఆశీర్వచనాలు అందించారు. ఆయనకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. చిత్ర నిర్మాత సురేష్ గారు నన్ను నమ్మి సినిమా నాకు అప్పగించారు. సినిమా అనుకున్న విధంగా చాలా బాగా వచ్చింది. అలాగే ఈ చిత్రం బాగా రావడానికి ఎంతో కష్టపడ్డ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కు ధన్యవాదములు. మంచి కాన్సెప్ట్ తో త్వరలో రిలీజ్ అవుతున్న మా చిత్రాన్ని చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.
సెన్సార్ బోర్డు మెంబర్ ఉపేంద్ర మాట్లాడుతూ..ట్రైలర్ చూస్తుంటే 100 కోట్లు పెట్టి తీసిన ఎఫెక్ట్స్ ఇందులో కనిపించాయి. ఈ సినిమా ట్రైలర్ చూసిన తరువాత సురేష్ తన డబ్బును పొదుపు చేసుకొని ధైర్యం చేసి ఇంత పెద్ద సినిమా తీశాడా అని నేనే ఆశ్చర్యపోతున్నాను. అదే విధంగా దర్శకుడు జయశేఖర్ మంచి క్రియేటర్, మేధావి కూడా, ఒక ఐదు సినిమాలు తీసినా ఘనత కూడా ఉంది. ఈ ఇద్దరి కాంబినేషన్ చూస్తుంటే రామలక్ష్మణుల్లా ఒకరికి తోడు ఒకరికి నీడ లా బాగా కుదిరింది.ఇందులో ప్రీతి మీనన్ గారు నటించడం అనేది మన అదృష్టంగానే భావించాలి నేను. ఇంకా జబర్దస్త్ టీం నుంచి కూడా కొంతమంది నటించారు. కొత్త వాళ్లైనా కూడా చాలా బాగా నటించారు. చిత్ర నిర్మాతకు
ఆర్థికంగా లాభాలు కలిగి మంచి పేరు ప్రఖ్యాతలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
హీరో రామ్ మాట్లాడుతూ.. ఇలాంటి మంచి సినిమాలో నటించే మంచి అవకాశం ఇచ్చిన సురేష్ గారికి, డైరెక్టర్ గారికి నా కృతజ్ఞతలు.
నటుడు రాజశేఖర్ మాట్లాడుతూ..ఈ సినిమాలో హీరోకి ఫాదర్ క్యారెక్టర్ చేశాను.కొత్త రకం కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
.. నటీ నటులు… ప్రీతి నిఘమ్, సురేష్ రాజ్,
రామ్అడ్డగిరి, భానుప్రసాద్, మాస్టర్ విజయ్, రేనుకుమార్, బ్రహ్మనందరెడ్డి, ఆంజనేయులు, నర్శింగ్, హాసినీరాయ్, ప్రగ్న, రాంబాబు, కరిష్ట తదితరులు
….. టెక్నిషియన్స్….
సమర్పణ.. పులిజాల నరసమ్మ
నిర్మాత.. పులిజాల సురేష్
రచన, దర్శకత్వం. జయశేఖర్ కల్లు
కెమెరా.. కళ్యాణ్ సమి
ఎడిటింగ్. వీఎఫెక్ట్స్.. వంశి పెల్లూరి..
మ్యూజిక్.. రణదేవ్. విజయ్
డ్యాన్స్.. ఉమాశంకర్
ఫైట్స్.. తుఫాన్
పిఅర్ఓ..బాలరాజు
మేకప్.. జగదీష్ రొండి
ఆర్ ఆర్ చిన్ని క్రిష్ణ
ఆర్ట్ లక్షమణ్ శ్రీనివాస్
పి. ఆర్. ఓ : బాలరాజు, నరేష్,
డిజిటల్ పిఆర్ : కలర్ఫుల్ డిజిటల్ మీడియా



