సాయి తేజ మ్యూజిక్ ప్రొడక్షన్ నెం.1 సమర్పణలో రాము రాథోడ్ ‘తాజ్‌మహల్’ పాట ఘనంగా విడుదల

సాయి తేజ మ్యూజిక్ ప్రొడక్షన్ నెం.1 బ్యానర్‌పై రూపొందిన సాంగ్ “తాజ్‌మహల్” పాట విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, విజయ్ పొలాకి మాస్టర్ ముఖ్య అతిథులుగా హాజరై పాటను విడుదల చేసి చిత్రబృందానికి తమ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా జానీ మాస్టర్ మాట్లాడుతూ.. “సాయి తేజ నా సోదరుడిలాంటి వ్యక్తి. ఆయన మరెన్నో అద్భుతమైన ఫోక్ సాంగ్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భవిష్యత్తులో ఆయనతో కలిసి ఒక మంచి ఫోక్ సాంగ్ చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాను” అని అన్నారు.

విజయ్ పొలాకి మాస్టర్ మాట్లాడుతూ.. “సాయి తేజ నా చిన్ననాటి స్నేహితుడు. అతను మరిన్ని విజయాలు సాధించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడం చాలా ఆనందంగా ఉంది” అని తెలిపారు.

నిర్మాత సాయి తేజ మాస్టర్ మాట్లాడుతూ.. “మా ‘తాజ్‌మహల్’ పాటకు ప్రేక్షకులు చూపిస్తున్న అపారమైన ప్రేమకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించిన అతిథులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు” అని అన్నారు.

రాము రాథోడ్ మాట్లాడుతూ.. “‘తాజ్‌మహల్’ పాట పాడుతున్నప్పుడే, డ్యాన్స్ చేస్తున్నప్పుడే ఇది ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని నమ్మకం కలిగింది. ఇప్పటికే విడుదలైన ప్రోమోకు అద్భుతమైన స్పందన, భారీ వ్యూస్ రావడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రేక్షకుల ప్రేమాభిమానాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు” అని అన్నారు.

నటి శర్వరి గుర్పూడే మాట్లాడుతూ.. “ఈ పాటకు ప్రేక్షకులు అందిస్తున్న ప్రేమ, ఆదరణకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ స్పందన మాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది” అని తెలిపారు.

కొరియోగ్రాఫర్ గురు మాట్లాడుతూ.. “‘తాజ్‌మహల్’ పాటను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ మా బృందం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు” అని తెలిపారు.

కార్యక్రమంలో చిత్రబృందం, సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పాట విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

నిర్మాతలు : సాయి తేజ సప్పన్న ,రాజు రెడ్డి గరిమిళ్ళ, అభిలాష్ పబతి .

లిరిక్స్ : సురేష్ కడారి

సంగీతం : కళ్యాణ్ కీస్

సింగర్ : రాము రాథోడ్

సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ : అరుణ్ జగతి

కొరియోగ్రఫీ : గురు మాస్టర్

Previous articleఒడియా సూపర్‌స్టార్ బాబుషాన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ‘అంతర్యామి’ చిత్రబృందం… స్పెషల్ పోస్టర్ విడుదల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here