దళితులను పావులుగా వాడుకోవద్దు – వైసీపీ కుల రాజకీయాలపై మండిపాటు 

శ్రీ మరిడమ్మ జాతరలో జరిగిన ఒక చిన్న ప్రమాదాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ కుల రాజకీయాలకు పాల్పడటం, పండుగ పవిత్రతను దెబ్బతీయడం దారుణం. జాతరలో డప్పు కొట్టి అలసిపోయి, కొద్దిగా మద్యం మత్తులో ఉన్న ఒక కళాకారుడు పొరపాటున అయ్యన్న పాత్రుడి గారి కాలి గాయంపై తొక్కడంతో ఆయన సహజంగానే ప్రతిస్పందించారు. ప్రతి ఒక్కరినీ సొంత మనుషుల్లా ఆదరించే ఆయనకు ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదు. కానీ ఈ చిన్న ఘటనకు కుల రంగు పులిమి, దళిత సోదరులను రెచ్చగొట్టాలని వైసీపీ కుటిల ప్రయత్నాలు చేస్తోంది.

దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి ఏమాత్రం లేదు. గత ప్రభుత్వ హయాంలో కరోనా సమయంలో మాస్కులు, గ్లౌజులు అడిగిన పాపానికి దళిత బిడ్డ డాక్టర్ సుధాకర్ గారిని పిచ్చివాడిగా ముద్రవేశారు. నడిరోడ్డుపై అర్ధనగ్నంగా కూర్చోబెట్టి అవమానించి ఆయన మరణానికి కారణమైన చరిత్ర వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిది. అలాంటి వారు ఇప్పుడు దళిత ప్రేమ వలకబోయడం హాస్యాస్పదం.

రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన వందల ఏళ్ల చరిత్ర ఉన్న శ్రీ మరిడమ్మ తల్లి పండుగను అపహాస్యం చేయడం, దళితులను తమ రాజకీయ క్రీడలో పావులుగా వాడుకోవడం వైసీపీ తక్షణమే మానుకోవాలి. అంకితభావంతో పనిచేసే ప్రజా నాయకుడు అయ్యన్నపాత్రుడి గారిపై జరుగుతున్న ఈ అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నాము. నిజాలను నిర్భయంగా చెప్పే గొంతులను కుల రాజకీయాలతో ఎప్పటికీ నొక్కలేరు.

Previous article“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here