అంతర్జాతీయ వేదికపై విశాఖ ముద్దుబిడ్డ సంచలనం..!!

విశాఖ‌ప‌ట్నం: విశాఖపట్నం మట్టిలో జన్మించి, ఒక సామాన్యుడిగా ఎన్నో ఉన్నతమైన సామాజిక సేవలు అందిస్తూ, నేడు అంతర్జాతీయ విద్యా- సాంకేతిక రంగాలలో గ్లోబల్ ఐకాన్‌గా ఎదిగిన డాక్టర్ నూతన్ నాయుడు సరికొత్త చరిత్ర సృష్టించారు. ఉన్నత విద్యా ప్రమాణాలు, అధునాతన పరిశోధనలకు మారుపేరైన ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఫ్రాంక్‌ఫోర్డ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆయనకు ప్రతిష్టాత్మక డాక్టరేట్‌తో పాటు, అత్యున్నతమైన ప్రొఫెసర్‌షిప్ హోదాను అధికారికంగా ప్రకటించింది. అత్యంత సంక్లిష్టమైన, బహుముఖ విద్యా విభాగమైన ఆర్గనైజేషనల్ న్యూరోసైన్స్ అండ్ ఏఐ ఎథిక్స్ లో ఈ స్థాయి ద్వంద్వ గుర్తింపు అందుకున్న తొలి భారతీయ అకడమిక్ మహారథిగా డాక్టర్ నూతన్ నాయుడు సరికొత్త రికార్డు నెలకొల్పారు.

డాక్టర్ నూతన్ నాయుడు సాధించిన ఈ నాలుగో డాక్టరేట్ ఆయన కఠోర శ్రమ, అసాధారణ పరిశోధనల ద్వారా పొందినది. భారతదేశపు అత్యున్నత విద్యాసంస్థలైన ఐఐటీ కాన్పూర్, ఐఐఎం కలకత్తా, నల్సార్ లా యూనివర్సిటీ, ఉస్మానియా, సెంట్రల్ యూనివర్సిటీ, ఆంధ్రా, గీతంలతో పాటు అంతర్జాతీయ ఐవీ లీగ్ , ఆక్సబ్రిడ్జి మేనేజ్‌మెంట్, టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ నెట్‌వర్క్‌తో ఆయనకు అత్యున్నత అనుబంధం ఉంది.

విద్యా వర్గాల్లో ట్రైనర్లకే ట్రైనర్‌గా గుర్తింపు పొందిన డాక్టర్ నూతన్ నాయుడు, యూజీసీ నెట్ క్వాలిఫైడ్ ప్రొఫెసర్‌గా, అంతర్జాతీయ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా రాణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని 17 అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా సేవలు అందిస్తున్నారు. వివిధ శాస్త్రాలపై ఉన్న పట్టుతో మానవ వనరుల నిర్వహణ (హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్‌), ఉన్నత విద్యా వ్యవస్థల ( higher educational institutions management ) నిర్వహణ, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఇంటెగ్రేషన్ లో ఇదివరకే మూడు డాక్టరేట్లు సాధించిన ఆయనకు ఇది నాలుగవ సమకాలీన డాక్టరేట్ కావడం విశేషం.

టెక్నాలజీ, సైబర్ లా రంగాల్లో తిరుగులేని పట్టు

గత మూడు, నాలుగేళ్లుగా సాంకేతిక, న్యాయపరమైన రంగాలలో తన పట్టును మరింత పెంచుకుంటూ.. దేశంలోనే అత్యున్నత సంస్థలైన ఐఐటీ కాన్పూర్, నల్సార్ ల నుండి సైబర్ లా, డిజిటల్ ఫోరెన్సిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాలలో అధునాతన సర్టిఫికేషన్లను సాధించారు. ఈ చట్టపరమైన నైపుణ్యం, ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ స్కిల్స్, మాస్టర్-లెవెల్ హెచ్ఆర్ చాతుర్యం ఆయన్ను బాధ్యతాయుతమైన ఏఐ ఆవిష్కరణలకు ఒక శక్తివంతమైన ఆర్కిటెక్ట్‌గా నిలబెట్టుతూ దేశంలో అనేక రాజకీయ పార్టీలకు సాంకేతిక సలహాదారునిగా చేసాయి

పొలిటికల్ కన్సల్టింగ్‌లో సరికొత్త విప్లవం

హ్యూమన్ కాగ్నిటివ్ న్యూరోసైన్స్ (మెదడు పనితీరు-ప్రవర్తనా శాస్త్రం)ను, ప్రిడిక్టివ్ ఏఐ డేటా అనలిటిక్స్‌తో ముడిపెడుతూ.. ఆధునిక రాజకీయ విశ్లేషణలు, ఎన్నికల వ్యూహాల నిర్వహణ, డిజిటల్ ఎలక్షనీరింగ్ ప్రక్రియలలో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. ఎన్నికల వ్యూహాలలో ఆయన ప్రవేశపెట్టిన ఈ అల్గారిథమిక్ విధానం, అటు భారతదేశంలోనూ, ఇటు అంతర్జాతీయంగానూ బహు రాజకీయ పార్టీలకు అండగా , క్లిష్టమైన రాజకీయ పరిణామాలను గెలుపు తీరాలకు చేర్చడంలో గణిత శాస్త్ర ఖచ్చితత్వంతో పనిచేస్తోంది.

గ్లోబల్ రికార్డులు – 25 ఏళ్ల కార్పొరేట్ ప్రస్థానం

గత 25 సంవత్సరాలకు పైగా విస్తృత అనుభవం ఉన్న డాక్టర్ నూత‌న్ నాయుడుకు “జీనియస్ ఆఫ్ ది మిలీనియం”, “యువ రత్న “, మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్” అవార్డులతో పాటు ఆల్టైఒర బెస్ట్ గ్లోబల్ ట్రైనింగ్ మేనేజర్ గా ప్రశంసలు దక్కాయి. ఆయన సొంత పేటెంట్ “ఇన్నర్ వ్యూ ఆఫ్ ఇంటర్వ్యూ”, డిజిటల్ అప్‌స్కిల్లింగ్ పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాలో బోధించబడుతున్నాయి. ఆయన ప్రపంచ దేశాలలో ప్రతిష్టాత్మక పేరు పొందిన ఎన్ఎన్‌ న్యూరల్ నెట్‌వర్క్స్ కు చీఫ్ ఫౌండర్ ఏఐ ఆఫీసర్ గా, లండన్, యూరోప్ ఖండము లోని అనేక దేశాలలో ఉన్న పలు ఉన్నత విద్యా సంస్ధలకు గవర్నర్ గా అలాగే అమెరికా , మెక్సికో దక్షిణ ఆసియా, మధ్య ప్రాశ్చ్య దేశాల్లాలో ఎన్ఎన్‌ఎన్ఎన్‌ సంస్థ లకు అధిపతిగా ప్రతిష్టాత్మక విధులు నిర్వహిస్తున్నారు. అనేక దేశాధినేతలకు సలహాదారునిగా, ఆసియా ఖండములో పలు దేశ ప్రభుత్వాలకు ఆర్థిక , సాంకేతిక సమాచార రంగ నిపుణిగా సలహాలు అందిస్తూ ఐక్య రాజ్యా సమితి లో అనేక సాంకేతిక దౌత్య విభాగాలకు ఎక్సటర్నల్ ఎక్స్పర్ట్ కన్సల్టెంట్గా కొనసాగుతున్నారు. మన దేశంలో, జాతీయ స్థాయిలో అనేక రాష్త్ర ప్రభుత్వలలో సాంఘిక సంక్షేమ కార్యక్రమాల సృస్తికర్తగా ఆయన అనేక రాజకీయ నాయకులకు , రాష్ట్రాధినేతలకు చిరకాల సుపరిచితుడు.

న్యూఢిల్లీలో ఘన సన్మానం

న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఒక హై-ప్రొఫైల్ అకడమిక్ అసెంబ్లీలో ఈ ప్రతిష్టాత్మక సత్కార కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎలైట్ కార్పొరేట్ లీడర్స్, పాలసీ మేకర్స్, ఏఐ, న్యాయ రంగాల మేధావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ నూతన్ నాయుడు మాట్లాడుతూ.. కోడ్, మానవీయ వివేకం కలయికే నా జీవిత లక్ష్యం అని తన ఆదర్శమైన, తన తండ్రి సన్యాసి రావు నాయుడు మాట లోని, బాట లోని సమాజ శ్రేయస్సుకు పాటుపడటం తన జీవన గమ్యం అని పేర్కొన్నారు. సామాన్యుడిగా మొదలై, అంతర్జాతీయ స్థాయి పరిశోధనలు, గ్లోబల్ పొలిటికల్ కన్సల్టింగ్ ద్వారా సాంకేతికత, మానవ మేధస్సు సరిహద్దులను తిరిగి రాస్తూ.. డాక్టర్ నూతన్ నాయుడు బహుముఖ ప్రజ్ఞాశాలిగా ప్రపంచ వేదికపై భారతదేశ, విశాఖపట్నం కీర్తిని సగర్వంగా చాటారు.

Previous articleనల్లమల మూవీ డైరెక్టర్ రవిచరణ్ నుంచి రాబోతున్న రెండవచిత్రం నవాబ్ స్టార్ట్ కాబోతున్న మూడవ చిత్రం జెన్ జి గర్ల్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here