ఒడియా సూపర్‌స్టార్ బాబుషాన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ‘అంతర్యామి’ చిత్రబృందం… స్పెషల్ పోస్టర్ విడుదల

ఒడియా సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా విశేష ఆదరణ పొందిన బాబుషాన్ మొహంతి జన్మదినం సందర్భంగా చిత్రబృందం ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకమైన అధికారిక పోస్టర్‌ను విడుదల చేసింది.

ప్రస్తుతం అమ్రిత్ ప్రెజెంట్స్–శివ సత్యం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న “అంతర్యామి” చిత్రంలో బాబుషాన్ మొహంతి కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన బర్త్‌డే పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

ఈ చిత్రంలో వేద్విక సోని కథానాయికగా నటిస్తుండగా, సీనియర్ నటీమణులు ఆమని, కస్తూరి, శ్రీతం దాస్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శివ సత్యం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రొడ్యూసర్స్ అమ్రిత్ నిషాద్ జ్ఞానరంజన్ సాహు, నిర్మిస్తున్నారు.

 

బాబుషాన్ మొహంతి జన్మదినం సందర్భంగా విడుదలైన ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో సినిమాపై మరింత ఆసక్తిని పెంచగా, త్వరలోనే చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలను చిత్రబృందం ప్రకటించనున్నట్లు తెలిపింది

 

అమ్రిత్ ప్రెజెంట్స్

చిత్రం: అంతర్యామి

హీరో: బాబుషాన్ మొహంతి

హీరోయిన్: వేద్విక సోని

ఇతర ముఖ్య నటి నటులు: ఆమని, కస్తూరి, శ్రీతం దాస్

దర్శకుడు: శివ సత్యం

ప్రొడ్యూసర్స్ – అమ్రిత్ నిషాద్ జ్ఞానరంజన్ సాహు,

ఛాయాగ్రహణం: కె. గుణశేఖరన్

సంగీతం: జీజే కార్తికేయన్

ఎడిటర్: అశోక్ బోయిన

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:బుస్సా

బాలరాజు

పీఆర్ &డిజిటల్: కలర్‌ఫుల్ డిజిటల్ మీడియా

Previous article“అంతర్యామి” షూటింగ్ పూర్తి… డబ్బింగ్ ప్రారంభం… త్వరలో ప్రేక్షకుల ముందుకు
Next articleసాయి తేజ మ్యూజిక్ ప్రొడక్షన్ నెం.1 సమర్పణలో రాము రాథోడ్ ‘తాజ్‌మహల్’ పాట ఘనంగా విడుదల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here