ఎల్లప్పుడూ కొత్తదనాన్ని ఎంచుకునే వర్సటైల్ యాక్టర్ ఆర్. మాధవన్ ప్రధాన పాత్రలో, నటుడు, దర్శకుడు కృష్ణకుమార్ రామకుమార్ కాంబినేషన్‌లో చిత్రీకరించిన బయోపిక్ ‘జి.డి.నాయుడు ’ (GDN). ‘ఎడిసన్ ఆఫ్ ఇండియా’, ‘మిరాకిల్ మేన్’, ‘వెల్త్ క్రియేటర్ ఆఫ్ కోయంబత్తూర్’ అని ప్రసిద్ధి చెందిన ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త, ఆవిష్కర్త గోపాల స్వామి దొరైస్వామి నాయుడు (జి.డి.ఎన్) స్ఫూర్తిదాయకమైన జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. జి.డి. నాయుడు బహుముఖ ప్రజ్ఞను, శ్రమను వెండితెరపై ఆవిష్కరించే ముఖ్యమైన పాత్రలో ఆర్. మాధవన్ నటించగా, సత్యరాజ్, జయరామ్, ప్రియమణి, దుషారా విజయన్ మరియు వినయ్ రాయ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం, ఆగస్ట్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
గతంలో నంబి నారాయణన్ బయోపిక్ ‘రాకెట్రి’ లో నటించి మెప్పించిన మాధవన్ ఈ సినిమా కోసం చేసుకున్న మేకోవర్, డిఫరెంట్ గెటప్స్ లో కనిపించడం, నాచురల్ గా ఉన్న పీరియాడికల్ సెటప్, నిర్మాణ విలువలు ‘జి. డి. ఎన్’ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. గోవింద్ వసంత అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్‌లోని ప్రతీ సన్నివేశాన్ని ఎలివేట్ చేసింది. ‘భారతీయ సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఒక మహానాయకుడి కథను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు.
ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన తెలుగు ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి, సినీ విశ్లేషకులు, విమర్శకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్రం ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ సినిమాల జాబితాలో ‘GD నాయుడు’ అగ్రస్థానంలో ఉంది.
నటీనటులు : ఆర్. మాధవన్, సత్యరాజ్, జయరామ్, ప్రియమణి, దుషారా విజయన్, వినయ్ రాయ్
నిర్మాతలు: వర్గీస్ మూలన్, విజయ్ మూలన్, ఆర్. మాధవన్, సరిత మాధవన్
బ్యానర్లు: వర్గీస్ మూలన్ పిక్చర్స్, ట్రై కలర్ పిక్చర్స్, మీడియామాక్స్ ప్రొడక్షన్స్
సంగీతం: గోవింద్ వసంత్
పీఆర్వో: నాగేశ్వరరావు (SNR)



