ప్రభాస్ 22 వ సినిమా ఆదిపురుష్.. వందల కోట్ల రూపాయల పెట్టుబడితో రూపొందిస్తున్నారు. బాహుబలితో దేశ, విదేశాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్‌కు ఇది చాలా ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు. బాలీవుడ్ తారలను కూడా దీనికోసం తీసు కుంటు న్నారు. రామాయణ కథ ఇతివృత్తంగా రూపుదిద్దుకుంటున్న సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. రావణుడిగా సైఫ్ అలీఖాన్ పేరు ఖరారైంది. దర్శకుడు ఓం రౌత్ దీన్ని హాలీవుడ్ లెవల్లో తీసేందుకు సిద్ధమయ్యారు. దాదాపు 50,000 గ్రాఫిక్స్ ఉంటాయని తెలుస్తోంది. కేవలం దీనికోసమే రూ.250-300 కోట్ల వరకూ ఖర్చు చేయబోతున్నారట. ప్రభాస్ సరసన హీరోయిన్‌గా సీత పాత్ర కోసం ఎవరు అనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే నలుగురైదుగురు పేర్లు ప్రతిపాదనలో ఉన్నాయి. వాటిలో అనుష్కశర్మ, కీర్తిసురేష్ మరికొందరి పేర్లు పరిశీలిస్తున్నారట.