“ఐరావతం” టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్

 రేఖ పలగాని సమర్పణలో నూజివీడు టాకీస్ బ్యానర్ పై అమర్ దీప్, తన్వి నెగ్గి, ఎస్తేర్ , అరుణ్ కుమార్, రవీంద్ర,సంజయ్ నాయర్ జయ వాహిని నటీనటులుగా సుహాస్ మీరా దర్శకత్వంలో  రాంకీ పలగాని, లలిత కుమారి తోట, బాలయ్య చౌదరిలు సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న చిత్రం “ఐరావతం”.ఈ ఐరావతం ఫస్ట్ లుక్ తాజాగా విడుదల చేశారు.ఈ సందర్భంగా
 దర్శకుడు సుహాస్ మీరా మాట్లాడుతూ..  ఫస్ట్ అఫ్ ఆల్ థాంక్స్ టూ మై ప్రొడ్యూసర్స్ ఈ కథ విని నన్ను నమ్మి ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చేందుకు ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గకుండా వెన్ను తట్టి నడిపినందుకు చాలా కృతజ్ఞతలు. ఒక వినూత్నమైన కథతో ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది.  మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాము. ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాము. అలాగే ఈ చిత్రంలో నటించిన నటీనటులు అందరూ వారి పాత్రలకు న్యాయం చేశారు. ఈ చిత్రం కోసం పనిచేసిన సాంకేతిక వర్గానికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
 నిర్మాతలు మాట్లాడుతూ :  ఈ చిత్రాన్ని  కథ లోని ఇంటెన్సిటీ తగ్గకుండా       జనాదరణ పొందే విధంగా నిర్మాణ విలువలతో నిర్మించటం జరిగింది. ఇది కచ్చితంగా ప్రేక్షకాదరణ పొందే చిత్రమవుతుందని ఆ విషయం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అర్థమైంది. ఫ్రెండ్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాం అని తెలియ జేస్తున్నాము. మా ఈ ఫస్ట్ లుక్ కి ఇంతటి ఆదరణ తీసుకొచ్చిన పి ఆర్ ఓ మధు గారికి మరియు ఆయన టీం కి ధన్యవాదాలు .
 నటీనటులు
అమర్ దీప్, తన్వి నెగ్గి, ఎస్తేర్, అరుణ్ కుమార్, రవీంద్ర,సంజయ్ నాయర్ జయ వాహిని తదితరులు
 సాంకేతిక నిపుణులు
సమర్పణ : రేఖ పలగాని
బ్యానర్ : నూజివీడు టాకీస్
నిర్మాతలు : రాంకీ పలగాని, లలిత కుమారి తోట, బాలయ్య చౌదరిలు తదితరులు
రచన-దర్శకత్వం సుహాస్ మీరా.
ఎడిటర్ సురేష్ దుర్గం,
సినిమాటోగ్రఫీ ఆర్ కె వల్లపు ,
సంగీతం సత్యా కశ్యప్,
పి.ఆర్.ఓ : మధు వి.ఆర్
Previous articleఐదు భాషల్లో ‘ఇక్షు’ టీజర్‌ను విడుదల చేసిన పోలీస్ అధికారిణి రాజేశ్వరి! 
Next articleమహిళా సమస్యలపై సత్వర విచారణ అవసరం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here