ఆయనో ఫైర్‌బ్రాండ్ అని ఫీలవుతారు. తాను మాట్లాడితే మెరుపులే అనే ఊహాలోకంలో విహరిస్తాడు. దువ్వెన తీసి క్రాఫ్ దువ్వినంత తేలికగా.. ఎదుటి వారిపై పంచ్‌లు విసురుతాననే అతి విశ్వాసం. వైఎస్ రాజశేఖర్ పుణ్యమాంటూ ఎన్నో ఏళ్లకు మళ్లీ రాజకీయ జీవితం వచ్చింది. వైసీపీలో అంటకాగటంతో జగన్ కంట్లో పడి అదృష్టవశాత్తూ… కాపు ఓటర్ల పుణ్యాన సత్తెనపల్లి నియోకవర్గం నుంచి ఎలాగైతే గెలిచి ఎమ్మెల్యే అయ్యాడు. అంతమాత్రాన అంబటి వెనుక జనం ఉన్నారనుకుంటే పొరపాటే. ఎందుకంటే .. సత్తెనపల్లిలో రెడ్డివర్గం అంబటి పెత్తనం సహించట్లేదు. గురజాలలో అడ్డగోలుగా మైనింగ్ చేస్తున్నాడంటూ సొంతపార్టీ నేతలు స్వయంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నియోజకవర్గంలో ఉండడని.. ప్రజలు వెళ్లినా అక్కడ ఎదురయ్యే అవమానాలు చాలా దారుణంగా ఉంటాయంటూ సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజల ఆవేదన. గతంలో ఓ మహిళ పట్ల అసభ్యంగా మాట్లాడి అడ్డంగా బుక్కయ్యారు. ఇంత ఘనచరిత్ర గల అంబటి ఇటీవల కాపు వర్గంపై నోరుజారటం.. కాపు సామాజికవర్గంలో తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. దాదాపు రాష్ట్రం నలువైపులా ఉన్న కాపు సామాజికవర్గ సంఘాలు నిరసనలు తెలిపాయి. కాపు కులం ద్వారా ఎమ్మెల్యే సీటు తెచ్చుకున్న అంబటి.. కాపులు తాగుబోతులు, తిరుగుబోతులు, మాంసాహారులు, సోమరులుగా చెబుతూ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. కోట్లాదిమంది ప్రజలున్న కాపులు దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు. సొంత కులం గురించి ప్రేలాపనలు చేయటం ద్వారా మంత్రి పదవి వస్తుందనే అంబటికి తగిన గుణపాఠం తప్పదంటూ హెచ్చరించారు. దీనిపై జగన్ మోహన్‌రెడ్డి కూడా అంబటిని గట్టిగానే క్లాసు తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీంతో.. అంబటికి తత్వం బోధపడిందట. ఇంకేముంది.. చుట్టూ ఉండే కొందరు కాపు నేతలతో మంతనాలు సాగించారట. ఏదో విధంగా ఈ అపవాదు నుంచి బయటపడేసే మార్గం చూడమంటూ ప్రాధేయపడుతున్నారట. మంత్రి పదవి వస్తుందని ఆశపడితే.. ఇలా అడ్డంగా బుక్కయ్యానంటూ సన్నిహితుల వద్ద గగ్గోలు పెడుతున్నారట సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారు.. ప్స్ పాపం.. ఏం చేస్తాం.. నోరు జారాక పర్యవసానం అనుభవించాల్సిందేనంటూ వైసీపీ పెద్దలు కూడా అంబటికి సానుభూతి చెబుతున్నారట.



