Home వైద్యం-ఆరోగ్యం మహమ్మారి కోవిడ్ విసిరిన రెండు సవాళ్లు

మహమ్మారి కోవిడ్ విసిరిన రెండు సవాళ్లు

dr lanka

Severe Acute Respiratory Syndrome-Coronavirus-2 (SARS-CoV-2) లేదా కోవిడ్ 19 అనబడే కరోనా వైరస్ రకం దాడికి ప్రపంచమంతా విలవిలలాడిపోతోంది.  ఈ మహమ్మారి తాకిడికి ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు.  ఈ సందర్భంగా ఈ వ్యాధి కారణంగా వ్యాధితో పోరాడుతున్న వారిలో లేదా కోలుకున్న వారిలో ఎన్నో కొత్త కొత్త రుగ్మతలను గమనిస్తున్నారు.  అత్యంత తీవ్రమైన అంటు వ్యాధిగా గుర్తించబడి రోగులకు పలు విధములైన తీవ్రతతో ఇబ్బంది పెడుతున్న విషయం తెలిసిందే.

ఈ మహమ్మారి కారణంగా సాధారణ ప్రజలు నానా ఇక్కట్లు పడుతుంటే ఇక వేర్వేరు దీర్ఘకాలిక వ్యాధులతో భాదపెడుతున్న వారిని పెడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.  ఇలాంటి వారిలో నిరంతరాయం వైద్యుల పర్యవేక్షణ అవసరమైన హృదయ సంబంధ వ్యాధులతో భాదపడే వారూ ఉన్నారు.    ఇలాంటి వారు అత్యవసర సమయాలలోనే కాకుండా నియమిత కాలంలో వైద్యులను సంప్రదించాల్సిన అవసరం ఉన్నా ఈ మహమ్మారి కారణంగా అది సాధ్య పడడం లేదు.  అందులోనూ వీరు కోవిడ్ బారిన పడే హై రిస్క్ కేటగిరిలో ఉండడం మరింత ప్రమాదకారిగా మారుతోంది.  అయినప్పటికీ వీరు అత్యవసర సమయాలలో తప్పనిసరై హాస్పిటల్ కు రావాల్సి వస్తోంది.  అయితే అత్యవసర సందర్భాలలో వీరు హాస్పిటల్ సందర్శించాల్సిన సమయాలలో మీరు పూర్తిగా సురక్షితం మరియు మీకు అవసరమైన చికిత్స ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందిస్తామన్న ధీమాను వైద్య సంస్థలు అందించాల్సి ఉంటుంది.  అపుడే ఇలాంటి రోగులు ఇతర భయాలు లేకుండా వైద్య శాలలకు వస్తారు.

మహమ్మారి కాలంలో నమ్మకం కగిలించడమే ముఖ్యం

హృద్రోగ సంబంధ వ్యాధులతో భాదపడే వారికి హాస్పిటల్స్ ఇవ్వాల్సిన సందేశం ఏమిటంటే మీరు సందర్శించాలనుకొనే హాస్పిటల్, తత్సంబందిత అత్యవసర విభాగం లేదా వైద్యునితో చేయబడే శస్త్ర చికిత్స లాంటి వలన మీకు ఎలాంటి ఇబ్బందులు రావనే నమ్మకాన్ని కలిగించాల్సి ఉంటుంది.  అపుడే రోగులు అవసరమైతే రావడానికి సిద్దంగా ఉంటారనే బలమైన సందేశం వెలుతుంది.  ఎందుకంటే గుండె పోటు తో కలిగే నష్టం కోవిడ్ రావడం కన్నా ఎక్కువ కాబట్టి.  అంతే గాకుండా గుండె పోటుకు సరైన సమయంలో చికిత్స ఎంతో అవసరం కూడా.

అయితే ఈ విషయంలో టెలీ మెడిసన్ ఎంతగానో ఉపయోగపడుతున్నప్పటికీ వైద్యులు నేరుగా పేషెంట్ ను చూసి స్వయంగా పరీక్షించే క్రమానికి మాత్రం ప్రత్యామ్నాయం కాదు.  టెలీ మెడిసన్ కేవలం ఈ మహమ్మారి కాలంలో అనవసరం గా ఇన్ఫెక్షన్ బారిన పడకుండా చూడడానికి తీసుకొన్న తాత్కాలిక ఉపశమన చర్య మాత్రమే.

ఈ నేపధ్యంలో వైద్యలు, వైద్య సేవలలో నిమగ్నమైన వ్యక్తులు లేదా సంస్థలు అత్యవసర పరిస్థితులలో తమ వద్దకు వచ్చే వారికి సరైన రక్షణ వ్యవస్థలు, జాగ్రత్తలు తీసుకొని తద్వారా వీరు హాస్పిటల్ కు వచ్చినపుడు లేదా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సందర్భాలలో కోవిడ్ మహమ్మారి బారిన పడకుండా చూసుకోవాలి.

మహమ్మారి కాలంలో హృద్రోగాలతో భాదపడే రోగుల యాజమాన్యం

హృద్రోగాలు అందులోనూ ముఖ్యంగా కార్డియో వాస్కులర్ వ్యాధులతో భాదపడే వారు తీవ్ర స్థాయి కోవిడ్ బారిన పడే ప్రమాదం ఉందని ఇప్పటి వరకూ అందిన సమాచారం సూచిస్తోంది.  దీంతో పాటూ వీరికి అవసరమైన అత్యవసర మందులు, పరికరములు అందడంలో ఈ మహమ్మారి వలన జాప్యం కావచ్చు లేదా దోరకక పోవచ్చు.

ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడాని రోగులకు అవసరమైన వైద్య చికిత్స, సేవలను అందించడంపై వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ సైంటిఫిక్ కమిటీ వారు కొన్ని చర్యలను సూచించారు.

వాటిలో ముఖ్యంగా

  • కోవిడ్ 19 పేషెంట్లు ఏదైనా సేవను అందుకోవడానికి వైద్య శాలకు వచ్చినపుడు వారి కోసం అత్యవసర విభాగాలలో ప్రత్యేకమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేయాలి. అలానే రోగి ఆరోగ్య పరిస్థితి, వ్యాధి తీవ్రతను బట్టి వారిని వేర్వేరు వార్డులలో ఉంచి చికిత్స అందించాలి.
  • అంతే గాకుండా ఈ పేషెంట్లలలో ఉన్న ఇతర రుగ్మతలైన హైపర్ టెన్షన్, డయాబెటీస్, ముందు నుంచి ఉన్న హృద్రోగ లేదా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, కిడ్నీ సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి రోగాలతో భాదపడే వారిని గుర్తించి వారిలో కోవిడ్ బారిన సులభంగా పడే వారిని వేరు చేసి చికిత్స అందించాలి.
  • అలానే కోవిడ్ 19 తో భాద పడే హృద్రోగ రోగులను మరియు కోవిడ్ లేని హృద్రోగ రోజులను వేర్వేరు వార్డులలో ఉంచడంతో పాటూ వారికి చికిత్స అందించడానికి ఉపయోగించే కాథరైజేషన్ ల్యాబులు, శస్త్ర చికిత్స గదులను వేర్వేరు చేసి ఉపయోగించాలి.

ఇలాంటి చిన్న చిన్న చర్యలు ఒక వేళ హాస్పిటల్ కు వస్తే తమకు కోవిడ్ రాదని దాంతో పాటూ అవసరమైన చికిత్స సరైన రీతిలో అందుతుందన్న నమ్మకం కలుగుతుంది.

హృద్రోగ సంబంధమైన వ్యాధులు మరియు కోవిడ్ 19

కోవిడ్ మహమ్మారి హృద్రోగ సంబంధిత వైద్యులకు సరికొత్త సవాళ్లను విసురుతోంది.  అలానే హృద్రోగ సంబంధమైన వ్యాధులతో భాదపడే వారు కోవిడ్ కు సంబంధించి హైరిస్క్ కేటగిరిలో ఉన్నారనేది ఇప్పటికే తేలుతున్న విషయం.  వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ సైంటిఫిక్ కమిటీ పేర్కొన్న దాని ప్రకారం కోవిడ్ వైరస్ కారణంగా మరణాలే కాదు కోలుకుంటున్న వారిలో కూడా ఎన్నో ఆరోగ్య సంబంధమైన సమస్యలు ఏర్పడుతున్నాయనేది కూడా నిపుణులు గుర్తించిన అంశం.  ముఖ్యంగా కోవిడ్ బారిన పడి చికిత్స పొందుతున్న వారు మరియు కోలుకున్న వారిలో పలు రకములైన హృద్రోగ సంబంధిత వ్యాధులతో పాటూ ఇతర రుగ్మతలు ఏర్పడి గుండెకు ప్రమాదం ఏర్పడుతుందనే వైద్య నిపుణుల దృష్టికి ఇప్పటికే వచ్చింది.

 

ఇక పలు హృద్రోగ సంబంధిత వ్యాధులున్న వారు కోవిడ్ తో ఇబ్బందిపడుతున్నారనడంలో సందేహం లేదు.  ఇక కొన్ని పరిశోధనా ఫలితాల ప్రకారం కోవిడ్ నుంచి కోలుకుంటున్న వారు రక్త నాళాలలో గడ్డలు ఏర్పడడం వలన స్ట్రోక్ బారిన పడుతున్నారని స్పష్టమవుతోంది.  అయితే దీనికి కారణమేమిటనే విషయం స్పష్టంగా తెలియకపోయినా కోవిడ్ వలన కొన్ని రకములైన హృద్రోగ సంబంధిత వ్యాధుల బారిన రోగులు పడుతున్నారనేది తేలిన విషయం.  అలానే కోవిడ్ కారణంగా రోగి హృదయ స్థితి గతులు లేదా దాని పని తీరు లేదా రెండింటి పై ప్రభావం పడుతుందనేది తొలి పరిశోధనలలో అర్థమవుతున్న అంశం.

రెండు సవాళ్లు

వరల్డ్ హార్ట్ డే 2020 సందర్భంగా హృద్రోగ సమస్యలపై ప్రజలలో అవగాహన కలిపించడమే కాకుండా కోవిడ్ బారిన పడకుండా ఎలా కాపాడుకోవాలనే అంశంపై కూడా సమగ్రమైన సమాచారాన్ని ప్రజల వద్దకు చేర్చాలని నిర్ణయించారు.  దీంతో పాటూ అత్యవసర సమయాలలో వీరు హాస్పిటల్ కు వెళ్లాల్సివచ్చినపుడు పూర్తిగా సురక్షితం అన్న విషయంపై కూడా నమ్మకం కలిగించడానికి అవసరమైన చర్యలపై కూడా తత్సంబందిత వ్యక్తులు, సంస్థలకు తెలియజేసే విధంగా ప్రచారాన్ని చేపట్టాలని తీర్మానించారు.

దీంతో పాటూ కోవిడ్ పాజిటివ్ పేషెంట్లు ఎదుర్కొంటున్న హృదయ సంబంధిత సమస్యలను గుర్తిస్తూ దానికి సంబంధించిన సూచనలు ఇవ్వడంతో పాటూ వారికి అవసరమైన ప్రత్యేకమైన చికిత్స అందేలా చూడడం వరల్డ్ హార్ట్ డే సందర్భంగా స్వీకరించబడిన రెండో సవాలు.  దీనికి సంబంధించి సమచారాన్ని అవసరమైన వారికి అందేలా చూడడంతో పాటూ ఈ ఆరోగ్య సమస్యను ఎలా ఎదుర్కోవాలనే దానిపై అవగాహన కలిపించడం చేయడం జరుగుతుంది.

by Dr. Lanka Satyarama Krishna, MBBS,DNB,DM; Senior Consultant Interventional Cardiologist, Aster Prime Hospital, Ameerpet, Hyderabad

 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here