తెలుగు హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్‌ది ప్రత్యేక శైలి. కేరళ కుట్టీ ఎంచక్కా తెలుగు నేర్చుకుని మరీ డైలాగ్‌లు చెబుతుంది. కానీ ఒకేఒక్క లోపం.. అదే కాస్త లావుగా ఉండటం. ప్రేమమ్, శతమానంభవతి, అఆ.. ఇలా చాలా సినిమాల్లో మంచి నటనతో ఆకట్టుకుంది. అయితే లావుగా ఉందనే కారణంతో అవకాశాలు కూడా తగ్గుతూ వస్తున్నాయట. ఒకప్పుడు అందాల అనుష్క అంటే ఎంత క్రేజ్. ఇప్పుడు ఆమె బరువు అవకాశాలను దూరం చేసింది. అందుకే… తాను కూడా మరో అనుష్కగా మారే అవకాశాలున్నాయనే భయంతో బాబోయ్ ఒళ్లు తగ్గించుకోవాలంటూ.. వ్యాయామం.. ఆహార నియమాలతో ఎంచక్కా నాజూగ్గా మారిందన్నమాట. చూసేవాళ్లకు.. ఈమె అనుపమ.. లేకపోతే.. ఆమె చెల్లెలా అనేంతగా సన్నగా.. మారిందట. అప్పట్లో బొద్దుగుమ్మలకు మాత్రమే హీరోయిన్ అవకాశాలు. ఏ మాత్రం పీలగా ఉన్నట్టుగా దర్శకుడుకు అనిపించినా వెంటనే ఒళ్లు పెంచమనో.. తరువాత చూద్దామనే పంపేవాళ్లట. ఇప్పుడు.. సీన్ రివర్స్ జీరోసైజ్.. ఎంత సన్నగా ఉంటే.. అంత రెమ్యునురేషన్ అన్నమాట. అందుకే.. అనుపమ ఇలా మారిందట. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో తన ఫొటోలను పోస్ట్ చేసి.. అభిమానులను తెగ ఖుషీ చేస్తున్నారు. కరోనా సమయాన్ని ఉపయోగించుకున్న జాబితాలో ఈ కుట్టీ కూడా చేరిందన్నమాట.
Anupama Parameswaran (@anupamaparameswaran96) • Instagram photos and videos