ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు రామతీర్ధం వద్ద చేపట్టిన ధర్నాను పోలీసులు భగ్నం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు జాగ్రత్తగా బీజేపీతో సహా హిందు సంఘాలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అంతవరకూ బాగానే ఉంది. సోము వీర్రాజు పట్ల పోలీసులు చాలా అనుచితంగా ప్రవర్తించారు. అదే ప్లేస్‌లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉంటే.. ఒకవేళ పోలీసులు.. ప్రత్యర్థులు కలసి.. పవన్‌పై జులుం ప్రదర్శించి ఉంటే ఏమయ్యేది. ఇది పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు వ్యక్తపరచిన అనుమానం కాదు.. సాక్షాత్తూ.. వైసీపీ రెబెల్ ఎంపీ రామకృష్ణంరాజు చేసిన హెచ్చరిక . సోషల్ మీడియా వేదికగా వైసీపీ ఎంపీ ఒక విషయాన్ని పంచుకున్నారు.
మంగళవారం రామతీర్ధం ధర్నాలో పవన్ కళ్యాణ్ పాల్గొని .. సోము వీర్రాజుకు ఎదురైన అనుభవం పవన్ చవిచూసి ఉంటే.. ఏపీ అగ్నిగుండంగా మారేందంటూ ఆందోళన వెలిబుచ్చారు. నిజమే.. ఏపీలో కాపు సామాజికవర్గం బలమైంది. ఎవరు కాదన్నా.. ఇది రాజకీయపార్టీలు కూడా గుర్తించాయి. 2014లో రాష్ట్ర విభజన తరువాత కాపు ఓట్ల కోసం టీడీపీ.. ఆ తరువాత వైసీపీ రెండూ పోటీపడ్డాయి. కాపుల ఐనైక్యతను అవకాశం చేసుకున్నాయి. ఇప్పుడు పవన్‌ను ఒంటరి చేసేందుకు కూడా ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారు. కానీ.. పవన్ విషయంలో పార్టీలకు అతీతంగా కాపులు తమ నేతగా గుర్తిస్తున్నారు. ముఖ్యంగా యువతీ, యువకుల్లో పవన్ ఓడినా పాపులారిటీ తగ్గలేదు. ఇటువంటి సమయంలో పవన్‌ను అరెస్ట్ చేయటమో.. దాడిచేసేందుకు ప్రయత్నించటం జరిగినా.. యువత రెచ్చిపోయే అవకాశం ఉంది. కులాల కురుక్షేత్రం జరుగుతున్న ఏపీలో మరింత గడ్డు పరిస్థితులు తలెత్తేవనేది ఎంపీ ఆందోళనకు కారణమట.
1988లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కాపు ఉద్యమ నేత వంగవీటి మోహన్‌రంగా దారుణ హత్య తరువాత.. దాదాపు 26 రోజుల పాటు.. ఏపీలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులతో పాటు అసాంఘికశక్తులు చేరి విధ్వంసం సృష్టించాయి. జనసేనానిని ప్రస్తుతం కాపులు. రంగా అభిమానులు. వీఎంరంగా వారసుడుగా భావిస్తున్నాయి. అటువంటి నేతపై నిజంగానే దాడి జరిగితే.. నిజమే.. వైసీపీ ఎంపి రామకృష్ణంరాజు ఆందోళన చెందినట్టుగానే ఊహించని దారుణంగా జరుగుందనేది వాస్తవమే అంటున్నాయి నిఘావర్గాలు కూడా.



