ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాలు పంచుకున్నారు. బుధవారం తిరుమల వెళ్లిన ఆయన పంచెకట్టు, తిరునామంతో కనిపించారు. తిరుమల వేంకటేశ్వరునికి పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీవారి గరుడ వాహన సేవలోనూ పాల్గొన్నారు. ముందుగా బేడి ఆంజనేయస్వామిని దర్శించుకున్నా సీఎం ఆ తరువాత బాలాజీకు ప్రత్యేక పూజలు చేశారు.