చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద చంద్రబాబు కాన్వాయ్ కు ప్రమాదం జరిగింది. కాన్వాయ్ లోని ముందు వాహనం సడన్ బ్రేక్ వేయటం తో వెనక ఉన్న ఎస్కార్ట్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఢీ కొట్టింది.తర్వాతి వాహనంలో ఉన్న చంద్రబాబు క్షేమంగానే వున్నారు. దెబ్బతిన్న వాహనం ముందు భాగం, స్వల్పగాయాలతో భద్రత సిబ్బంది మరో వాహనంలో కి మారారు. అమరావతి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.