బతుకమ్మ పండుగ 2020

ఈ ఏడాది బతుకమ్మ పండుగను అక్టోబర్ 16 నుండి 24వ‌ తేదీ వరకు జరుపుకోవాలని మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సూచన చేశారు . బతుకమ్మ పండుగ జరుపుకునే తేదీలపై ప్రముఖ సిద్ధాంతులు, పంచాంగకర్తలు, జ్యోతిష పండితులతో కూడిన ‘తెలంగాణ విద్వత్సభ’తో కవిత స‌మావేశ‌మై చర్చించారు‌. అధిక ఈశ్వీయుజ మాసం కారణంగా శ్రీ శార్వరి నామ సంవత్సరం లో వచ్చే బతుకమ్మ పండుగ తేదీలపై ఉన్న అస్పష్టతలను తొలగించేందుకు గాను పండుగ తేదీల‌పై చ‌ర్చించారు.

ఈ సంవత్సరం అధిక మాసం రావడం వల్ల పండుగ తేదీలపై కొంత సందేహాలు ఉన్నాయన్నారు. ఈ నేప‌థ్యంలో ‘తెలంగాణ విద్వత్సభ’ ఆధ్వర్యంలో పండితుంతా చర్చించి ఈ సంవత్సరం పండగ తేదీలను శాస్త్ర ప్రకారం నిర్ణయించారని అన్నారు . ప్రతి సంవత్సరంలాగ బాధ్రపద మాసంలో కాకుండా, అశ్వయుజ మాసంలో( అక్టోబర్) 16 వ తేదీన బతుకమ్మను ప్రారంభించి, తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహించాలన్నారు.
తెలంగాణ జాగృతి అనేక‌ సంవత్సరాల నుండి బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నందున, చాలా మంది బతుకమ్మ తేదీల గురించి తనను సంప్రదిస్తున్న‌ట్లుగా కవిత తెలిపారు. దీంతో ‘తెలంగాణ విద్వత్సభ’ సలహా తీసుకున్న‌ట్లు చెప్పారు. ప్రతి 19 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి పరిస్థితి ఎదురౌతుందని, శాస్త్ర ప్రకారం ఇందులో ఎలాంటి తప్పు లేదని వేద పండితులు తెలిపారన్నారు. పండితులు, సిద్ధాంతుల సూచనల ప్రకారం అక్టోబర్ 16 న బతుకమ్మను ప్రారంభించాలని తెలంగాణ ఆడపడుచులను ఆమె ఈ సంద‌ర్భంగా కోరారు. ‘తెలంగాణ విద్వత్సభ’ ముఖ్యులు మరుమాముల వెంకటరమణ శర్మ బోర్బట్ల హనుమంతాచార్యులు, తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సేవాసంఘాల సమాఖ్య అధ్యక్షులు వెన్నంపల్లి జగన్మోహన శర్మ, నరేష్ కులకర్ణి ఇతర పండితులు, మాజీ ఎంపీ కవితను కలిసిన‌వారిలో ఉన్నారు.

Previous articleDP WORLD SIGNS UP AS GLOBAL LOGISTICS PARTNER OF ROYAL CHALLENGERS BANGALORE
Next articleసోమన్న…కమలం పెద్దన్న!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here