గుంటూరు: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సిమ్స్ విద్యాసంస్థల అధినేత భీమనాదం భరత్ రెడ్డి మంగళవారం కలిశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఎస్ఎం జియావుద్దీన్ టీడీపీ వీడి వైఎస్ఆర్ సీపీలోకి చేరిక సందర్భంగా ఆయన్ను జగన్ దగ్గరకు తీసుకెళ్లిన పార్టీ పెద్దల్లో భరత్ రెడ్డి ఒకరు. ఈమేరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో భరత్ రెడ్డి పుష్పగుచ్ఛంతో ముఖ్యమంత్రిని కలవగా… జగన్ ఆయన్ను ఆప్యాయంగా పలకరించారు. వైఎస్ఆర్ సీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా పార్టీ ముఖ్యకార్యక్రమాల్లో భరత్ రెడ్డి కీలకభాగస్వామ్యం వహిస్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కి భరత్ రెడ్డి సన్నిహితునిగా ఉంటూ.. బయట నుంచి ముఖ్యనేతల చేరికలో చురుగ్గా పనిచేశారని సీఎం జగన్ మెచ్చుకున్నారు. స్థానిక శాసనసభ్యులతో సఖ్యత కొనసాగిస్తూ ప్రధానంగా గుంటూరు తూర్పులో పార్టీ పట్టుకు మూలస్థంభంగా నిలిచినట్లు భరత్ రెడ్డి కి సీఎం వద్ద గుర్తింపు లభించింది. పదవులతో ప్రమేయం లేని నేతగా ఎదిగిన భరత్ రెడ్డికి భవిష్యత్తులో పార్టీ, ప్రభుత్వ పరంగా మెరుగైన అవకాశాలుంటాయని పార్టీ పెద్దల సమక్షంలో చర్చరావడం గమనార్హం.




Good going