మెగాస్టార్ సరికొత్తగా కనిపించి ఫ్యాన్స్‌కు ఊహించని షాక్ ఇచ్చారు. సాధారణంగా అయితే చిరంజీవి ఎలా కనిపించినా.. అభిమానులకు పండుగే. కానీ తొలిసారి.. ఇలా గుండుతో దర్శనమివ్వటంతో అసలు ఇది నిజమేనా! లేకపోతే.. మార్ఫింగా అనే అనుమానాలున్నాయి. అయితే కొత్త సినిమా కోసం ఇదొక ప్రయత్నం కావచ్చని సమాచారం. మొన్నా మధ్య మీసాలు లేకుండా కుర్రఫోజులో మెరిశారు. ఇప్పుడిలా.. గుండుబాస్‌గా.. బిగ్‌బాస్ కనిపించటం వెనుక వాస్తవం ఏమిటనేది తెలియాలి. ఏమైనా.. మెగాస్టార్ విష్ చేసినా.. ఏదైనా చెప్పాలనుకున్నా కొత్తదనం.. క్రియేటివిటీ కూడా ఉంటాయి. పవన్ పుట్టినరోజు వేళ ట్వీట్ చేసిన ఫొటో.. చిరు పుట్టినరోజు నాడు.. మోహన్‌బాబు ఇచ్చిన కర్ర రాయల్‌ఫీల్డ్‌తో కనిపించి ఔరా అనిపించారు. మరి ఈ గుండు వెనుక అసలు కథ ఏమిటనేది అన్నయ్య నోటినుంచే రావాలి.




