బీజేపీకు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఝలక్ ఇచ్చాయి. దుబ్బా, జీహెచ్ ఎంసీ ఎన్నికల తరువాత తమను తాము ఎక్కువగా అంచనా వేసుకున్న కమలానికి తెలంగాణ ఓటర్లు గట్టిగానే షాకిచ్చారు. వరంగల్, హైదరాబాద్ పట్టభద్రులు చెప్పిన జవాబు నుంచి ఇప్పటికీ బండి సంజయ్ కోలుకోలేని పరిస్థితులో ఉన్నారు. సంజయ్ మాట తీరు.. తెలంగా ణ ప్రభుత్వంపై విమర్శలు రెండు ఎన్నికల్లో ఆయన్ను హీరోను చేశాయి. ఆ తరువాత క్రమంగా నోరుజారటం.. పద్దతి లేకుండా ఉద్యమం అంటూ చులకనవుతూ వచ్చారు. క్రమంగా సంజయ్ ఎంత తక్కువ సమయంలో గుర్తింపు తెచ్చుకున్నారో.. అంతే తక్కువ సమయంలో బొక్కబోర్లాపడ్డారంటూ టీఆర్ ఎస్ నేతలు ఎద్దేవాచేస్తున్నారు. రాజకీయాల్లో ఆచితూచి మాట్లాడటం.. చేయి అందించిన ప్రతి ఒక్కరితో స్నేహంగా మెలగటం రెండు సూత్రాలను మరిచారు. ఇదే.. ఇప్పుడు నాగార్జునసాగర్ ఉ ప ఎన్నికలో ఎవర్ని నిలపాలనే ప్ర శ్నకు అవకాశం ఇచ్చింది. ఇప్పటికే కాంగ్రెస్ జానారెడ్డిని ప్రకటించింది. టీఆర్ ఎస్ కూడా మంచి అభ్యర్థి కోసం వెతుకుతుంది. నోములకు సరిజోడుగా ఎవరు ఉంటారనే ఆలోచనతో ఉంది. దీంతో టీఆర్ ఎస్ అభ్యర్థిని ప్రకటించాక.. చూద్దాంలే అని బీజేపీ లెక్కలు వేసుకుంటుంది. ఏపీలోని తిరుపతి ఉప ఎన్నిక కూడా బీజేపీకు సవాల్ విసురుతోంది. ఎలాగైనా గెలిచి తీరాలనే కసితో ఉన్న బీజేపీ అక్కడ ఎంపీగా గెలిస్తే కేంద్రంలో మంత్రిపదవి గ్యారంటీ అంటూ ప్రచారం చేస్తుంది. ఇప్పటికే టీడీపీ పనబాక లక్ష్మి, వైసీపీ గురుమూర్తి అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉన్న నేపథ్యంలో జనసేన, బీజేపీ ఏ పార్టీ తరపున అభ్యర్థిని బరిలోకి దింపాలనే తేలకుండా ఉంది. బీజేపీ ఏకపక్షంగా తామే బరిలో ఉంటామంటూ ప్రకటించటం పవన్‌కు చిర్రెత్తుకొచ్చేలాచేసిందట. మిత్రధర్మాన్ని కాదని.. సోము వీర్రాజు ఒంటెద్దు పోకడలు గెలిచే సీటును కాలదన్నుకునేలా చేస్తాయనేది జనసేన అభిప్రాయంగా ఉంది. ఏమైనా.. బీజేపీను ఉప ఎన్నికల నేపథ్యంలో తెలుగు ఓటర్లు చెమట్లు పట్టిస్తున్నారనేది వాస్తవం.