హైదరాబాద్‌లో బొనిటో డిజైన్స్‌ నూతన కేంద్రం ప్రారంభం

  1. ప్రముఖ హోమ్‌ ఇంటీరియర్‌ డిజైన్‌ సంస్థ బొనిటో డిజైన్స్‌ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను విస్తరించింది. ఇందులో భాగంగా గచ్చిబౌలిలో 14 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను ప్రారంభించింది. ఇప్పటికే ముంబై, బెంగళూరులో సేవలందిస్తున్న సంస్థ తాజాగా హైదరాబాద్‌లోనూ తన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రముఖ డిజైనర్‌ గౌరీ ఖాన్‌ సంస్థకు గ్లోబల్‌ డిజైన్‌ అడ్వైజర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ సందర్భంగా గౌరీ ఖాన్‌ మాట్లాడుతూ.. ఇల్లు అనేది అందులో నివసించే వారి వ్యక్తిత్వం, అభిరుచులకు ప్రతిబింబంగా ఉండాలని అన్నారు. అందం, సౌకర్యం, ఉపయోగకరత కలగలిపిన డిజైన్లకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌ ప్రజలు ఆధునిక, వ్యక్తిగత అభిరుచులకు అనుగుణమైన ఇంటీరియర్‌ డిజైన్లపై ఆసక్తి చూపుతున్నారని, కొత్త కేంద్రం ద్వారా వారికి విభిన్న డిజైన్‌ అవకాశాలను పరిచయం చేయనున్నట్లు చెప్పారు.

సంస్థ సీఈవో శ్వేతాంక్‌ జైన్‌ మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా సంస్థ ఆదాయం ఏటా రెట్టింపు అవుతోందని, ప్రస్తుతం వార్షిక ఆదాయం రూ.450 కోట్లకు పైగా ఉందని తెలిపారు. ఇప్పటివరకు 15 వేలకుపైగా గృహాలకు ఇంటీరియర్‌ డిజైన్లు అందించినట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లోని కొత్త కేంద్రం ద్వారా ఏడాదికి రూ.180 కోట్ల ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో ఐటీ, వాణిజ్య రంగాల అభివృద్ధితో ఆధునిక గృహాలకు, నాణ్యమైన ఇంటీరియర్‌ డిజైన్లకు డిమాండ్‌ పెరుగుతోందని సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో గృహ యజమానుల జీవనశైలి, అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక డిజైన్లు, సమర్థవంతమైన స్థల వినియోగం, ఆధునిక గృహాలంకరణ పరిష్కారాలను ఈ కేంద్రంలో అందించనుంది. సంస్థకు ఐఎస్‌ఓ 9001:2015 ధ్రువీకరణ ఉంది.

Previous articleఅంగరంగ వైభవంగా “ఓ టార్చర్ ప్రేమ” చిత్ర టీజర్ లాంఛ్ ఈవెంట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here