అంతర్వేదిలో రథం దగ్ధమైన ఘటనపై హిందుసంఘాలు మండిపడుతున్నాయి. వరుసగా హిందు దేవాలయాల్లో చోటుచేసుకుంటున్న సంఘటనల వెనుక సూత్రదారులను పెద్దలు కాపాడుతున్నారనే ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గతానికి భిన్నంగా వరుస ఘటనలో హిందుసమాజ మనోభావాలను పూర్తిగా దెబ్బతీస్తున్నట్టుగానే భావిస్తున్నారు. ఎవరికైనా చిన్న ఇబ్బంది తలెత్తగానే.. కాషాయ జెండా కనిపించగానే ఉగ్రులై.. లాఠీకు పనిచేప్పే యంత్రాంగం ఇప్పుడు చోధ్యం చూడటాన్ని తప్పుబడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని హిందు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏపీ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఏదో నామమాత్రపు విచారణతో మభ్యపరచి.. ఇదంతా మతిభ్రమించిన వారి పనంటూ కేసును పక్కదారిపట్టిస్తే తాము న్యాయపోరాటం చేస్తామంటూ తేల్చిచెబుతున్నారు. ఈ నెల 9వ తేదీ హిందూసంఘాలు చలో అంతర్వేదికి పిలుపునిచ్చాయి.

రాష్ట్ర వ్యాప్తంగా చలో అంతర్వేది బుధవారం మధ్యాహ్నం 1:00 హైందవ సంఘాలు కలిసి ఘటన స్థలంలో శాంతియుత నిరసన తెలిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. గతంలోనూ బిట్రగుంట ప్రశన్న వేంకటేశ్వర రధం దగ్ధమైంది. పీఠాపురం విగ్రహాలు ధ్వంసం. కాకినాడ సర్పవరం.. విగ్రహాలు ధ్వంసం . రొంపిచెర్ల వేణుగోపాలస్వామి విగ్రహాలు ధ్వంసం . ఉండ్రాజవరం అమ్మవారి ముఖద్వారం ధ్వంసం అంతర్వేది రధం ధ్వంసం మతిస్ధిమితంలేని వ్యక్తులు హిందూ దేవాలయాలు పైన మత్రమే ఎందుకు దాడి చేస్తున్నారంటూ చెప్పటంపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. నందిగామలో సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో హిందూ సంఘాల ప్రతినిధులు అందజేశారు. చలో అంతర్వేది కార్యక్రమానికి కొల్లూరు శ్రీనువాసు శర్మ, పెనుగొండ దుర్గాప్రసాద్ , తోలేటి రాంబాబు, గన్నవరపు శ్రీనువాసు,హనమత్ ప్రసాద్ , నాగిడి ఫణిరాజష్, గుడిమెట్టల. కనక రెడ్డి, తోట గంగరాజు, వెలగల. శ్రీ కృష్ణా భగవాన్ రెడ్డి, పులేటి కుర్తి కామేశ్వరరావు , తమనంపూడి. విజయ రెడ్డి, చీడే జగపతి, కర్రి. గంగాధర్ రెడ్డి, చెఱుకు మిల్లి సంతోష్, పొతురాజు సత్యనారాయణ , జోస్యల.వెంకట్రామ్, మెడుారి సతీష్ శర్మ, యణమండ్ర రామలక్మి, పెండ్యాల భవానీ, కలగా వెంకట సుబ్రహ్మణ్యం , వందేమాతరం అశోక్ తదితరులు ఏర్పాట్లు చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై నిరసనగా విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా వీహెచ్‌పీ నేత సత్యరవికుమార్ మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి హైందవ ధర్మంపై దాడులు జరుగుతున్నాయన్నారు. ఇన్ని దాడులు, దారుణాలు జరుగుతున్నా మంత్రులు, అధికారులులు స్పందించడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. దేవాదాయ శాఖ మంత్రి బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం సిబిఐ తో దర్యాప్తు చేయించి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. అతి పెద్ద ఆదాయం కలిగిన దేవాలయాలను ప్రభుత్వం తన గుప్పిట్లో పెట్టుకుందన్నారు.



