మొన్న నిర్భయ్.. నిన్న బ్రహ్మాస్.. నేడు శౌర్య.. ఇండియన్ మిస్సైల్స్ చైనా పక్కలో బల్లెంగా మారాయి. నిన్నటి వరకూ భారత్‌పై ఒంటికాలిపై లేచిన చైనా ఇప్పుడు శాంతిమంత్రం వల్లెవేస్తోంది. పర్వతాల్లో భారతీయ యోధులను ఎదిరించటం చేతగాక.. పాకిస్తాన్ కిరాయి సైనికులతో శిక్షణ ప్రారంభించింది. ఇండియాతో యుద్ధం అనగానే వీరులుగా బయల్దేరిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు దారిలో శోకాలు పెట్టి ఏడ్వటం.. తమ వీరపనితనాన్ని ప్రపంచం చూడటం జరిగిపోయాయి. తైవాన్ మీడియా పుణ్యామంటూ విషయం బయటకు పొక్కింది లేకపోతే.. చైనా మేకపోతు గాంబీర్యం ఎప్పటికీ గుట్టుగానే ఉండేది. గ్లోబల్ టైమ్స్ అనే చైనా అధికార పత్రిక కూడా మొదట్లో చైనాను తక్కువ అంచనా వేస్తున్నారంటై ఇండియాకు సలహా ఇవ్వాలని ప్రయత్నించింది. కానీ.. లక్షన్నర సైనికులు బోర్డర్‌లో కవాతు చేస్తున్న విషయం తెలియగానే.. ఇట్టాగే వదిలేస్తే ఏ అర్ధరాత్రో చైనా రాజధాని బీజింగ్ నడిబొడ్డున భారతీయ పతాకంతో లాంగ్‌మార్చ్ చేస్తారనే విషయాన్ని ఆలస్యంగా గ్రహించింది. చీనీ-ఇండియా భాయిభాయీ అంటూ కొత్త పల్లవి అందుకుంది. అంతర్జాతీయంగా కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారతీయ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు సన్నద్ధంగా ఉన్నామంటూ పిలుపునిచ్చారు.
ఇటీవల వాయుసేన కూడా పాక్, చైనాతో ఏకకాలంలో యుద్ధానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటించి శత్రుదేశాలకు మరోసారి వణకు పుట్టించారు. ఇది చాలదన్నట్టుగా.. ఇటీవల డీఆర్‌డీవో రూపొందించిన నిర్బయ్ క్రూయిజ్ మిస్సైల్ విజయవంతంగా ప్రయోగించటమే కాదు ఆల్రెడీ రంగంలోకి కూడా దింపారు. ఈ సబ్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ 6 మీటర్ల పొడవు, 1500-1600 కిలోగ్రాముల బరువు, 450 కిలో గ్రాముల పేలుడు పదార్ధాలను తీసుకెళ్లగలదు. 800-1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల స్థావరాలను దెబ్బతీయగలదు. ఇప్పటికే బ్రహ్మోస్ సామర్థ్యంతో ఉలికిపాటుకు గురయ్యే శత్రుమూకలకు శౌర్యతో మరింత జలదరింపు మొదలైందట. అణ్వాయుధాలను తీసుకెళ్లగల శౌర్యను తాజాగా ప్రయోగించి విజయం సాధించారు. దీన్ని చైనా బోర్డర్‌లో అణ్వాయుధ ప్రయోగానికి అనుకూలంగా సిద్ధం చేయటమే చైనాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుందట.
శత్రుదేశాల జలాంతర్గాములను ఖచ్చితంగా విధ్వసం చేయగల టోర్పడో పరీక్ష కూడా ఒడిషా నుంచి విజయవంతంగా ప్రయోగించారు. రష్యా, చైనా, అమెరికా తరువాత టొర్పడో సామర్థ్యం ఉన్న దేశాల్లో భారత్ కూడా చేరింది. ఇవన్నీ పాక్, చైనాలను దృష్టిలో ఉంచుకుని వరుసగా చేస్తున్న ప్రయోగాలనే అనేది ఆ ఇరు దేశాలకు అర్ధమైందట. అగ్ని 1, 2, 3, 4, 5 ఆల్రెడీ అమ్ముల పొదిలో దర్జాగా ఉన్నాయి. ధనుష్, సాగరిక, బ్రహ్మోస్, పృద్వీ అవసరమైతే వైరి దేశాల వైపు దూసుకెళ్లేందుకు రెడీగా ఉంచారు. చైనా బోర్డర్‌కు సమీపంలో శౌర్య క్షిపణి ఉంచటం వెనుక ప్రధాన కారణం పాక్, చైనాలకు గుణపాఠం చెప్పటమే. సబ్‌మెరైన్లను ఇండియా చుట్టూ ఉన్న సముద్రజలాల్లో యుద్ధనౌకలను పహారాకు దించిన చైనాకు టోర్పడో ద్వారా గట్టిగానే హెచ్చరిక పంపినట్టుగా తెలుస్తోంది. ఇవన్నీ తెలిసో.. తెలియకో.. చైనా ఒక అడుగు ముందుకేసినా ఖేల్ ఖతం అంటున్నాయి సైనిక వర్గాలు. వీటన్నింటినీ మించిన భారతీయ సైనికుల అజేయ పరాక్రమాలు.. అసమాన ధైర్య సాహసాలు ఆల్రెడీ చైనా, పాకిస్తాన్ కళ్లారా చూసే ఉన్నాయి.