కేవలం మూడు నెలల వ్యవధిలో పదుల సంఖ్యలో ప్రయోగాలు. శత్రువుల వెన్నులో వణకుపుట్టించే అస్త్రశస్త్ర పరిశోధనలతో భారత్ ధీటుగా నిలబడింది. ఆయుధాల కోసం పరాయిదేశాలపై ఆధారపడాల్సిన అవసరం మున్ముందు ఉండబోదనే సంకేతాలు పంపింది. ట్రంప్ ఓటమితో చైనా కాస్త కుదుటపడింది. భారత్‌కు అమెరికా సాయం ఇక మిధ్య అనే ఆలోచనలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. కానీ.. బైడెన్ మాత్రం.. భారత్ తమకు మిత్రదేశమంటూ ప్రకటించి చైనా ఆనందంపై నీళ్లు చల్లారు. ఇది చాలదన్నట్టుగా.. భారత్ బోర్డర్‌లో శత్రువుల వెన్నులో వణకు పుట్టించే సైనికులను రంగంలోకి దింపారు. సెకన్ల వ్యవధిలో శత్రు శిబిరాల్లోకి దూసుకెళ్లి మారణ హోమం సృష్టించగల బృందాలుగా వీటికి పేరుంది. ఇవన్నీ ఇప్పుడు ఫాంగాంగ్ సరస్సుకు సమీపంలో మోహరించాయి. నీటిలో.. కొండల్లో.. మైదాన ప్రాంతాల్లో ఎక్కడైనా యుద్ధం చేయటంలో శిక్షణ పొందినవీరంతా చైనా ఆర్మీకు వణకు పుట్టిస్తున్నారట. ఇప్పటికే సంతోష్ కుమార్ బృందం చూపిన తెగువకు పీపుల్ లిబరేషన్ ఆర్మీ భారత్‌తో యుద్ధమంటే పదిసార్లు ఆలోచిస్తుందంట. బోర్డర్‌లో డ్యూటీ అంటే భారత్ సైనికులు ఎదురు రొమ్ము విరచుకుని రెఢీ అంటారు. కానీ.. చైనా సైనికులు మాత్రం.. భారత్ బోర్డర్ అనగానే సెలవు అడుగుతున్నారట. ఇప్పుడు మెరైన్ కమాండోలు, గరుడ కమాండోలు, స్పెషల్ ఫ్రాంటియర్ పోర్స్ మూడు బృందాలు ఇప్పుడు సరిహద్దులో రక్షణ కవచంగా నిలబడ్డాయట. అంతే.. ఇప్పుడు చైనా భయానికి కారణమట.