సినీ నటుడు ప్రకాష్‌రాజ్ మెగా ఫ్యామిలీపై మాటల దాడి కొనసాగిస్తున్నాడు. మొన్న ఒక ఇంటర్వ్యూలో జనసేనాని పవన్‌ను ఊసరవెల్లితో పోల్చాడు. పార్టీలు మార్చుతూ. పొత్తులు కుదుర్చుకుంటూ ఉంటే ఏమనాలంటూ ప్రశ్నించాడు. పైగా తాను అన్న మాటలకు కట్టుబడి ఉన్నట్టుగా ప్రకటిస్తున్నాడు. దీనిపై మెగా బ్రదర్ నాగబాబు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ప్రతి పనికిమాలిన వాడు పవన్‌ను విమర్శించేవాడేనంటూ అనటంతో పాపం ప్రకాశ్‌రాజ్ ముఖాన నెత్తురు చుక్కలేనట్టుగా మారిందట. అసలే సినిమాల్లేక కష్టాల్లో ఉన్న మోనార్క్ నటుడుకి ఇది ఊహించని షాక్‌గా ఉందట. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతకాదన్నా.. మెగా ఫ్యామిలీదే హవా. డజను మంది హీరోలు. పది మంది నిర్మాతలున్న కుటుంబం. అయినా ప్రకాశ్‌రాజ్ కావాలనే మెగా కుటుంబంతో తగవు పెట్టుకుంటున్నట్టుగా ప్రచారం సాగుతోంది . గతంలోనూ వర్మ, బాలయ్య వంటి వారు కూడా మెగా ఫ్యామిలీపై నోరుజారారు. చిరంజీవి, పవన్ పట్ల చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలోనూ నాగబాబు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు ప్రకాశ్‌రాజ్ విషయంలోనూ అదే జరిగింది. కానీ.. దీనిపై తప్పును సరిదిద్దుకోవాల్సిన ప్రకాశ్‌రాజ్ తనకు తెలుగు వచ్చని.. నాగబాబు వాడే తెలుగురాదంటూ ప్రతిగా స్పందించాడు. మరి.. ఈ రచ్చ మున్ముందు ఎంత వరకూ వెళ్తుందనేది కాలమే నిర్ణయించాలి.