అబ్బా.. ఎందుకీ ప్రశ్న. ఈ రోజే ఎందుకు అడగాలి అనుకుంటారేమో! సెప్టెంబరు 22వ తేదీకు కొణిదెల శివశంకర వరప్రసాద్ పేరు మార్చుకుని చిరంజీవిగా ఉద్భవించేందుకు ప్రత్యేకత ఉంది. అదెలా అంటారా! చిరంజీవి నటించిన మొదటి సినిమా పునాదిరాళ్లు. కానీ దానికంటే ముందుగానే రెండో సినిమా ప్రాణంఖరీదు రిలీజైంది. సరిగ్గా 42 సంవత్సరాల క్రితం అంటే.. 1978 సెప్టెంబరు 22న ప్రాణంఖరీదు విడుదలై.. తొలిసారి మెగాస్టార్ వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ కళ్లలోనే తెలియని పవర్ ఉందయా! ఏదో ఒక రోజు సినీ ఇండస్ట్రీను ఏలేస్తాడంటూ అప్పట్లోనూ ది గ్రేట్ దర్శకులు బాపూ జోస్యం చెప్పారట. పైన ఉన్న తథాస్తు దేవతలు కూడా ఆశీర్వదించారు. కోట్లాది మంది అభిమానులకు ఆరాధకుడుగా మారాడీ అంజనీ పుత్రుడు. తన 100వ సినిమా త్రినేత్రుడు కూడా సెప్టెంబరు 22న విడుదలైంది. ఈ సందర్భంగా మెగాస్టార్ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు అగస్టు 22తోపాటు.. సెప్టెంబరు 22 కూడా తన జీవితంలో చాలా తీపిజ్ఞాపకమంటూ అభిమానులతో ట్వీట్ ద్వారా పంచుకున్నారు. ఇంతకీ.. చిరంజీవిని అభిమానులు అన్నయ్య అంటారు.. మెగాస్టార్‌గా సినీ పరిశ్రమ ఏనాడో గుర్తించింది. మరి ఇంట్లో చిరును ఏమని పిలుస్తారంటే.. మిస్టర్ సీ. ఇంట్లో ఆయన మాటే వేదం.. ఏ పనిచేయాలన్నా.. మిస్టర్ సీ చెప్పాల్సిందే. ఎంత నవ్వుతూ ఉన్నా.. క్రమశిక్షణ విషయంలో సీరియస్‌గా మారతారట. ఆ సమయంలో ఇంట్లో ఎవరైనా వణకిపోవాల్సిందేనట. ఆ క్రమశిక్షణే.. చిరును మెగాస్టార్ చేసింది.. అదే ఇంటి నుంచి 12 మంది హీరోలను వెండితెరకు పరిచయం చేసిందంటారు అభిమానులు.
#BornAsAnActor #ForeverGrateful #PranamKhareedu #thisdaythatyear pic.twitter.com/lKM1qQhpN9
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 22, 2020