ఏ దేశమేగినా ఎందు కాలిడినా… అన్నట్లు దేశవిదేశాల్లో ఉన్న మెగాభిమానులకు మెగాస్టార్ చిరంజీవి మాటే వేదం. వినోదసీమలోనే కాకుండా సేవానిరతిలో కూడా చిరంజీవి కనబరుస్తున్న శ్రద్ధాశక్తులు అభిమానుల్ని సైతం ఆకట్టుకుంటున్నాయి. అందుకే, అమెరికాలో ఉన్నా… మస్కట్‌లో ఉన్నా మెగాభిమానులు చిరంజీవి ఆశయసాధన కోసం ఇతోధికంగా కృషి చేస్తూనే ఉన్నారు… అచ్చం శ్రీ చందక రాందాస్ లాగ. ఇవాళ ఆయన పుట్టిన రోజు సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతోంది.
చందక రాందాస్ మస్కట్‌లో ఉంటూ చిరంజీవి మెగా యూత్ ఫోర్స్ (CMYF) వ్యవస్థాపక అధ్యక్షులుగా Omen Country లో వివిధ ప్రాంతాలలో సామాజిక సేవలందిస్తున్నారు. దేశం కాని దేశంలో మెగాస్టార్ పేరు మీద ఓ సంస్థను స్ధాపించి అక్కడి తెలుగు సంఘాలు అందరి మన్ననలు పొందిన శ్రీ చందక రాందాస్ నిజంగా ధన్యజీవి… పుణ్యజీవి. అనేక సేవా కార్యక్రమాలు చేసి అక్కడి ప్రభుత్వం ద్వారా అనేక పర్యాయాలు ‘బెస్ట్ సోషల్ సర్వీస్ సంస్థ (CMYF) గా అభినందనలు అందుకున్నారు. చందక రాందాస్ ఎన్నో అవార్డులు, రివార్డులు స్వీకరించారు. Muscat లో తెలుగువారికి విశేష సేవలందిస్తూ పేరు ప్రఖ్యాతులు చందక రాందాస్స ముపార్జించారు.