ఈ కరోనా ఎన్నో పాఠాలు నేర్పింది మంచి చేయగలిగేది కేవలం మానవ జన్మ ఉన్నంత వరకే,మన వీధిలో వాళ్ళు తెలిసినవాళ్ళు కనీసం ఇంటి కీ కూడా రాకుండా మట్టిలో కలిసిపోయారు అది కూడా ముక్కు మొకం తెలియని వాళ్ళు కాస్త దయతలచి చేయటం వల్ల ఇన్ని చూసాక అయినా కాస్త మారండి. నాది నాది అనుకొంటూ ప్రాకులాడక మనం మనది అనుకొంటే చాలు ఇందుకోసం ఆస్తులు అమ్ముకోవక్కరలేదు నువ్వు తినగా మిగిలింది అప్పుడప్పుడు పెడితే చాలు ఇలా ప్రతీ ఒక్కరూ ఆలోచిస్తే ఆకలి తో అలమటించిన పేదరికం అనే పదం కేవలం పుస్తకాలలో మాత్రమే మనకి కనిపిస్తుంది.ఈ కరోనా వల్ల పూట గడవని వాళ్ళు బ్రతుకుతడేమో అనే ఆశతో అప్పుల పాలైన వారు,పని లేక ఇల్లు గడవక బయటకు వెళ్ళే పరిస్థితి లేని వారు,నాన్నను పోగొట్టుకొని కొందరు,ఇద్దరినీ పోగొట్టుకొని అనాధలైన చిన్నారులు,పని లేక పూట పూట కి మెతుకు జాడకై వగచే బ్రతుకులెన్నో…
ఈ రోజు ఓ మారుమూల గ్రామమైన నెళ్ళివారిగుడెం అనే ఊరు వెళ్లి 80 కుటుంబాలకు కూరగాయలు ఇచ్చి వచ్చాను.అలాగే నాగుపల్లి లోని ఉన్నత పాటశాలలో దగ్గర ఉన్న 20 కుటుంబాలకు ఆఖరుకి రోడ్డుపై వెళ్ళే వాళ్ళకి కూడా పిలిచి ఇచ్చాను.వాళ్ళకి నేను చేసింది చిన్న సహయమే కానీ కనీసం 1 వారం రోజులు కూరకి చూసుకోవక్కరలేదు అలా కొంతైనా నాకు చేతనయింది చేశాను. పక్కవాడిని పలకరిస్తే ఏం అప్పు అడుగుతారో అనే ఆలోచించే మనం ఒక క్షణం ఆగి మనకి బాగోపోతే ఈ రోజుల్లో దూరాన ఉన్న బంధువులు రారు పక్కింటి వాళ్లే మనకి తోడుంటారు అని తెలుసుకుంటే చాలు.
ప్రేమతో
డాక్టర్ సుధ కొనకళ్ళ అనువంశిక ఆయుర్వేద వైద్యురాలు
సుధ కొనకళ్ళ హెర్బల్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్
సత్తుపల్లి – 9704242156