సైలెంట్‌గా విస్తరిస్తోన్న కరోనా ఎప్పటికి అంతమవుతుంది? వ‌్యాక్సిన్‌పై ఎంత క్లారిటీ ఉంది? నాలుగైదు వైరస్‌ల సంగమంతో రూపుదిద్దుకున్న మహమ్మారిని వదిలించటం సాధ్యమయ్యేపనేనా? ప‌్రపంచమంతా ఇదే చర్చ. వైరస్ సోకుతుందనే భయపడటం మానేసి.. అసలు వైరస్‌కు గురిగాకుండా జాగ్రత్తగా ఉండగలిగితే. ఎస్.. ఇప్పుడు మానవాళి ముందున్న పరిష్కారం ఇదొక్కటే. మాస్క్ ధరిస్తాం.. ఎవరైనా ఫ్రెండ్ హాయ్‌చెప్పగానే ఎంచక్కా భుజాన చేయేస్తాం. మరో పదిమంది తోడవగానే గుంపులో కలసిపోతాం. అయితే.. ఇమ్యూనిటీ ఉన్నవాళ్లలో పెద్దగా సమస్య ఉండదు. రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవాళ్లకు లక్షణాలు కనిపించకుండా వైరస్‌కు గురైన వారి నుంచి క్రిములు వెంటనే దాడి చేస్తాయి. మూడు రోజుల వ్యవధిలోనే వ్యాధికి గురయేలా చేస్తాయి. ఇప్పుడు కొత్తగా నమోదవుతున్న కొవిడ్ 19 పాజిటివ్ కేసుల్లో 60శాతం ఇవేనంటున్నారు వైద్యులు. మరి దీనికి విరుగుడు లేదా! అంటే అదీ ఉంది.. ఎలా అంటారా! మాస్క్ ధరించటం, శానిటైజర్, ఇంటా, బయటా కొన్ని జాగ్రత్తలు పాటించటం.
ఇటువంటి విపత్తు వేళలో ప్రజలకు అందుబాటు ధరలో.. సాంకేతిక పరిజ్ఞానం.. ఆధునికత.. సృజనాత్మకత జోడించి హైదరాబాద్ బాలానగర్‌లోని దక్షమెడిటెక్ సరికొత్త సామాగ్రిని తయారు చేసింది. దక్షమెడిటెక్ యజమాని వీరభద్రరావు దాదాపు మూడు నెలల పాటు దేశ, విదేశాల్లో జరుగుతున్న అధ్యయనాలపై పరిశోధనలు చేసి.. తన బృందంతో కలసి అద్భుతమైన మెటిరీయల్ తయారు చేశారు. ఇల్లు, కార్యాలయాలు, ప్రభుత్వ ఆఫీసులు, కార్పోరేట్ సంస్థలు, షాపింగ్‌మాల్స్, సూపర్‌మార్కెట్‌లు ఎక్కడైనా వీటిని ఉపయోగించవచ్చు. భారతదేశ అవసరాలు.. ఇక్కడి ఆర్ధిక పరిస్థితులను ప్రత్యక్షంగా చూసిన వీరభద్రరావు నెలల తరబడి రీసెర్స్ చేసి మరీ.. నిపుణులతో కలసి వీటికి రూపమిచ్చారు.
ఎన్95 మాస్క్.. బహిరంగ మార్కెట్‌లో రూ.250 వరకూ ఉంది. దీప్తి అనే ఐఐటీ పూర్వ విద్యార్ధిని సహాయంతో కాపర్, కాటన్ కలబోతగా సరికొత్త ఎన్95 మాస్క్ రూపొందించారు. వాస్తవానికి ఏదైనా వస్తువు మీద వైరస్ దాదాపు 24-48 గంటల వరకూ ఉంటుంది. కానీ.. కాపర్(రాగి)పై ఇది కేవలం 4 గంటలు మించి బతకలేదు. దక్ష మెడిటెక్ తయారు చేసిన మాస్క్ మన్నికగా
ఉన్నాయి. ఎన్నిసార్లయినా వాడేందుకు అనువుగా ఉంటున్నాయని వీరభద్రరావు తెలిపారు. పీపీఈ కిట్లు, సర్జికల్ మాస్క్‌లు, ఆటోమేటిక్ వాల్ శానిటైజర్లు, డిస్పెన్సరీ స్టాండ్స్, యూవీ శానిటైజర్ బాక్సులు, ఫుడ్, క్యాష్‌కు సంబంధించిన వాటిపై వైరస్‌ను నాశనం చేయగల సాంకేతిక పరికరాలను తయారు చేశారు. కరోనా కట్టడిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎంతోమంది ప్రశంసలు అందుకుంటున్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి తెలుగు రాష్ట్రాలతోపాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దక్షమెడిటెక్ రూపొందించిన పరికరాలను వినియోగిస్తున్నాయి. దాదాపు 500 మందికిపైగా కస్టమర్లున్నారు. అపార్ట్‌మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్, కార్పోరేట్ ఆసుపత్రులు,బ్యాంకులు, విద్యాసంస్థలు, ఏటీఎం కేంద్రాల్లో వీటినే ఉపయోగించటం దక్ష పట్ల ఎంత క్రేజ్ ఉందనేందుకు ఉదాహరణలు… లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన ఎంతోమంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. మీరు కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని.. వైరస్‌ను ఎదిరించే పరికరాలను కొనుగోలు చేయాలన్నా.. వివరాల కోసం..
పేస్‌బుక్‌లో: Daksha Technologies, Veerabhadrarao Dambala ద్వారా తెలుసుకోవచ్చు.