తెలంగాణ మంత్రి కరోనా బారీనపడ్డారు. ఆయనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు చెప్పారు. రవాణామంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు సోమవారం నిర్వహించిన వైద్యపరీక్షల్లో కొవిడ్ 19 పాజిటివ్ గా తేలింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. నాకు కరోనా పాజిటివ్ అని తెలియగానే ప్రేమతో, అభిమానంతో ఆందోళన చెందిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు. నన్ను కలిసిన వారు, నాతో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు దయచేసి COVID పరీక్ష చేసుకోవాలని మనవి. అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ నందు హోం ఐసోలాషన్ లో ఉన్నారు. మీ ప్రేమే నాకు అసలైన వైధ్యం. దయచేసి నాకు ఫోన్ చేయడానికీ, నన్ను కలుసుకోవడానికీ ప్రయత్నించకండి. నా హెల్త్ అప్ డేట్స్ ఎప్పటికప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. మళ్ళీ యధావిధిగా మీ మధ్యకు వచ్చి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటానంటూ వివరించారు.