ఒకే రోజు 2.5లక్షల కరోనా కేసులు. ఇప్పటికిదే రికార్డు స్థాయి. ఔను.. ఆదివారం చేసిన వైద్యపరీక్షల్లో వెల్లడైన భయం కలిగించే వాస్తవం. ఏపీ, తెలంగాణలో పరిస్థితులు దారుణంగా మారాయి. చేతినిండా డబ్బున్నా…. బెడ్ దొరకటం కష్టంగా మారింది. నాలుగు రోజులు ముందుగానే చెబితే అది కూడా ఉన్నతస్థాయిలో పైరవీలు చేస్తే మినహా బెడ్లు దొరకట్లేదు. ఇది హైదరాబాద్‌లో పరిస్థితి. కేవలం పది రోజులకు సరిపడినంత ఆక్సిజన్ నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఏపీలో సెక్రటెరియేట్‌లో పనిచేసే ముగ్గురు ఉద్యోగులు కరోనాతోమరణించారు. ఇది రెండ్రోజుల వ్యవధిలో జరిగిన దారుణం. బీజేపీ నేత మోత్కుపల్లి పరిస్థితి విషమంగా మారింది. ఇదంతా జనం చేసిన తప్పిదమే అంటున్నారు వైద్యులు. మూడు నెలల క్రితం లాక్డౌన్ నుచి బయటపి ఊపిరి పీల్చుకుందామని మాస్క్‌లు తీసేశారు. దూరమైన వారికి దగ్గరకావాలని మందిలోకి చేరారు. దాని ఫలితమ రెండో వేవ్ ఇంత దారుణంగా ఉండటానికి కారణం.
2021 డిసెంబరు వరకూ ఇదే పరిస్థితి. 2022లో ఎలా ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేమంటున్నారు శాస్త్రవేత్తలు. మోటేషన్స్ అంటే. వైరస్ మార్పులు చెందుతూ బలంగా మారటం.. కొత్త రూపాలతో వివిధ శరీర భాగాల ద్వారా లోపలకు చేరటంతో దాన్నెలా ఎదుర్కోవాలనేది ప్రశ్నార్ధకంగా మారింది. కొత్త వేరియంట్లు పుట్టుకురావటం, వైరస్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చినా చివరకు వారిలో పాజిటివ్ నిర్దరణ కావటం ఇవన్నీ గుబులు పుట్టించటమే కాదు.. ప్రపంచానికి గుండె దడ తెప్పిస్తున్నాయి.
21, 22, 30, 40… ఈ వయసులో ఉన్నవాళ్లకు ఒక ధీమా ఉంటుంది. గట్టిగా ఉన్నాం మనకేం కాదనే భరోసా ఉంటుంది. ఇది కరోనా వైరస్‌కు మాత్రం ఏం తెలుసు. ఇప్పుడిదే తెలుగు నాట చర్చకు దారితీస్తుంది. భయానికి కారణమవుతుంది. ఫస్ట్ వేవ్‌లో వృద్ధులు, మధ్యవయసున్న వారి మీద విరుచుకుపడిన వైరస్ ఇప్పుడు అంటే రెండో వేవ్‌లో కుర్రాళ్ల మీదనే ప్రభావం చూపుతుంది. లక్షణాలు బయటపడటం ఆలస్యం కావటంతో గుర్తించలేకపోతున్నారు. అప్పటికే లంగ్స్‌లోకి చేరిన వైరస్ నష్టం చేస్తుంది. ఆసుపత్రికి వెళ్లటం ఆలస్యం కావటంతో ప్రాణాలు కోల్పోతున్నారు. భోజనం చేయటం ఎంత సహజంగా మారిందో.. మాస్క్ ధరించటం అదే విధంగా దైనందిన జీవితంలో భాగం చేసుకోవటమే వైరస్ నుంచి బయటపడేందుకు మార్గం అంటున్నారు వైద్యనిపుణులు.



