రాజ‌కీయ యోధుడు చంద్ర‌బాబునాయుడు!

రా చంద్ర‌బాబునాయుడు.. విజ‌న్ ఉన్న అతి త‌క్కువ‌మంది నేత‌ల్లో ఒక‌రు. ప‌దవిలో ఉన్నా లేక‌పోయినా అదే పోరాట‌ప‌టిమ‌. అతిత‌క్కువ వ‌య‌సులో మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన బాబు కొద్ది స‌మ‌యంలోనే ఏపీ సీఎం కాగ‌లిగారు. దీనివెనుక ప‌రిణామాలు ఏమైనా కావ‌చ్చు. అప్ప‌టి ప‌రిస్థితుల‌ను త‌న‌కు అనుకూలంగా మ‌ల‌చుకోవ‌టంలో బాబు పై చేయి సాధించారు. ఒక ఉద్యోగి ప్ర‌మోష‌న్ కోరుకుంటాడు.. ఎమ్మెల్యే అయ్యాక మంత్రి.. ఆ త‌రువాత సీఎం ప‌ద‌వి ఆశించ‌టం పొలిటీషియ‌న్ల‌లో కామ‌న్‌. కానీ అంద‌రూ అంత వ‌ర‌కూ చేర‌లేరు. అటువంటిది బాబు మాత్రం నాలుగు సార్లు సీఎం కాగ‌లిగాడంటే రాజ‌కీయ చాణ‌క్య‌త ఉన్న‌ట్టే అనేది విశ్లేష‌కుల అభిప్రాయం. 70 ఏళ్ల వ‌య‌సులో అదే దూకుడు… అదే రాజ‌కీయం. ప్ర‌శంస‌లు. విమ‌ర్శ‌ల‌కు అతీతంగా పోరాడుతున్నారు. 2014లో రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత జ‌రిగిన తొలి ఎన్నిక‌ల్లో ఏపీ ఓట‌ర్లు చంద్ర‌బాబును సీఎంగా కోరుకోవ‌టం వెనుక ఆంత‌ర్యం… ఏపీను అభివృద్ధి చేయ‌గ‌ల స‌త్తా బాబుకు మాత్ర‌మే ఉంద‌నే న‌మ్మ‌క‌మే. అయితే దానికి త‌గిన‌ట్టుగానే బాబు రాజ‌ధాని, పోల‌వ‌రం , ఐటీ కంపెనీల‌తోపాటు సంక్షేమ కార్య క్ర‌మాలు బాగానే అమ‌లు చేశారు. అయితే.. ఏపీలో గ‌తానికి భిన్నంగా టీడీపీ నేత‌లు చౌక‌బారుగా ప్ర‌వ‌ర్తించారు. కులాల‌కు స‌మ‌ప్రాధాన్య‌త వ‌దిలేశారు. ఒకే వ‌ర్గానికి పెత్త‌నం క‌ట్ట‌బెట్టారు. ఫ‌లితంగా మిగిలిన కులాల నుంచి వ్య‌తిరేక‌త‌ను కొని తెచ్చుకున్నారు. అదే 2019లో బాబు ఓట‌మికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌నేది టీడీపీ నేత‌లూ గ్ర‌హించారు.

ఇప్పుడు వైసీపీ ఏలుబ‌డిలో చ‌విచూస్తున్న క‌ష్టాలు చంద్ర‌బాబునాయుడుని గుర్తు చేస్తున్నాయి. బాబు ఉంటే బాగుండేద‌నే భావ‌న కూడా క్ర‌మంగా పెరుగుతుంది. స్థానిక ఎన్నిక‌ల్లో ఓట‌మి చ‌విచూసినా టీడీపీకు చంద్ర‌బాబు అనే వ్య‌క్తి ఉన్నంత వ‌ర‌కూ ప‌సుపు ద‌ళం చెక్కుచెద‌ర‌నే అభిప్రాయం కూడా ఉంది. ఇవ‌న్నీ పార్టీలో నేత‌ల‌ను చూసి కాదు.. కేవ‌లం చంద్ర‌బాబు అనే విజ‌న‌రీ లీడ‌ర్ ఉండ‌బ‌ట్టే.. రాజ‌కీయాలు చేయాలంటే రాజ‌కీయ‌మే ప్ర‌యోగించాల‌నే సూత్రాన్ని గ‌ట్టిగా న‌మ్మిన వ్య‌క్తి.. ప్ర‌తికూల ప‌రిస్థితుల్లోనూ చురుగ్గా ఎత్తుకు పై ఎత్తులు వేయ‌గ‌ల స‌మ‌ర్థుడు. అస‌లు సిస‌లైన చంద్ర‌బాబు నాయుడు. 70వ పుట్టిన రోజు జ‌రుపుకుంటున్న ప్ర‌జ‌ల మ‌నిషికి క‌ద‌లిక టీమ్ పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు చెబుతుంది. రాబోయే రాజ‌కీయాల్లో మ‌రోసారి జాతీయ రాజ‌కీయాల్లో తెలుగువాడి వాడి…. వేడి రుచిచూపించాల‌ని మ‌న‌సారా కోరుకుంటోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here