ఫలానా వాళ్లకే.. ఫలానా జబ్బు వస్తుంది. వీళ్లు మాత్రమే ప్రమాదంలోకి వెళతారంటూ.. లెక్కకట్టడం చాలా కష్టమే. అయినా కొన్నింటికి శాస్త్రీయమైన ఆధారాలు లేకపోయినా కళ్లెదుట కనిపిస్తు న్నపుడు నమ్మాల్సిందే. ఖచ్చితంగా నమ్మితీరాలా! అంటే అదంతా వారి ఇష్టాయిస్టాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడెందుకీ మాటలు అనుకుంటే.. కరోనా సెకండ్ వేవ్ తో యూరప్ ఉడికి పోతుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ చలి ప్రభావం మొదలవటంతో కొవిడ్19 పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇక్కడే మరో ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. 35 శాతం మంది బాధితులు 21-30 సంవత్సరాల మధ్య వయస్కులు కావటమే. మాస్క్‌లు వదిలేశారు. దూరం మరచిపోయారు. కానీ.. వైరస్ మాత్రం ఇవన్నీ గుర్తుపెట్టుకునే ఉంది. అందుకే. ఏ మాత్రఅవకాశం దొరికినా కమ్మేస్తుంది. బలహీనులను తనలో కలిపేసుకుంటుంది. అయితే.. ఇలా వైరస్‌కు గురవుతున్న బాధితులు రక్తాన్ని పరీక్షించినపుడు అమెరికన్ సొసైటీ ఆఫ్ హెమలాటజీ ఓ కొత్త విషయాన్ని గమనించింది.
కరోనా భారిన పడుతున్న వారిలో ఎక్కువ శాతం ఏ, ఏబీ బ్లడ్ డ్రూపులకు చెందినవాళ్లు ఉంటున్నారట. ఓ గ్రూపువాళ్లు చాలా తక్కువగా వైరస్ సోకుతున్నట్టుగా తేల్చారు. ఇదేదో ఆషామాషీగా చేసిన పరీక్ష కాదు.. సుమారు 5 లక్షల మంది కరోనా పేషెంట్ల బ్లడ్‌గ్రూప్‌లను పరిశీలించి వాటిపై అధ్యయనం చేసినపుడు ఈ విషయాన్ని గమనించారు. వెంటిలేటర్ వరకూ వెళ్లిన వారిలో కూడా ఏ,ఏబీ బ్లడ్‌గ్రూప్ వాళ్లే ఎక్కువగా ఉన్నట్టుగా తేల్చారు. పైగా వీళ్లలో లంగ్స్, కిడ్నీలు బాగా డ్యామేజ్ అయ్యాయట. ఈ లెక్కలన్నీ సరిపోల్చితే.. ఓ, బి బ్లడ్ గ్రూపుల వాళ్లు కరోనా వల్ల పెద్దగా ఇబ్బంది పడటంలేదట. అంతమాత్రాన.. ఈ రెండు గ్రూపుల వాళ్లు అసలు కరోనా సోకకుండా ఉంటారనేందుకూ ఎటువంటి ఆధారాల్లేవు. ఇవన్నీ కేవలం బ్లడ్ శాంపిల్స్.. రోగులను బట్టి అంచనా వేసినవే. కాబట్టి.. బ్లడ్ గ్రూపు ఏదైనా.. దోమలకు ఒకే రుచి అన్నట్టుగా.. కరోనా కూడా.. నిర్లక్ష్యంగా ఉన్నోళ్లని కమ్మేస్తుందనేది మాత్రం వాస్తవం.



