ఎలుక జాతికి చెందిన మింక్ అనే జంతువు ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని రుజువైన కారణంగా కోటి డెబ్భై లక్షల మింక్ లని డెన్మార్క్ ప్రభుత్వం చంపబోతుంది. ప్రపంచంలోనే మింక్ లు అధిక సంఖ్యలో వుండే దేశం డెన్మార్క్ అయినప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తి ని అరికట్టటానికి ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని ఆ దేశం చెప్తుంది. డెన్మార్క్ ప్రధాన మంత్రి మెట్ ఫ్రెడెరిక్సన్ మాట్లాడుతూ దేశ ప్రజల ఆరోగ్యం ఇంకా ప్రపంచదేశాల శ్రేయస్సు దృష్ట్యా ఇది తప్పని చర్య అని చెప్పారు.



