వివాహం జరిగిన నాలుగు రోజులకే ఓ నవవధువు ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. శోభనం రాత్రి జరిగిన గొడవ వల్లే ఆమె ఆత్మహత్యకు యత్నించినట్లు కుటుంబ సభ్యులు జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. తూర్పుగోదావరి జిల్లా, కట్రేనకోనా మండలం, బొట్టుచెరువు గ్రామానికి చెందిన సాక స్వామి కుటుంబం బతుకు దెరువు కోసం నగరానికి వచ్చి జగద్గిరిగుట్ట ప్రాంతంలోని ప్రగతినగర్ ఎస్‌వీఆర్ హైస్కూల్ సమీపంలో నివాసముంటున్నారు. మేస్ర్తీపని చేసే స్వామికి ఇద్దరు సంతానం. పెద్ద కుమార్తె సౌజన్య(24)ను ఈనెల 6నవెంకటేశ్వరరావుకు ఇచ్చి వారి స్వగ్రామంలో వివాహం జరిపించారు. 9వ తేదీ రాత్రి వారికి శోభనం ఏర్పాటు చేశారు.