సామాజిక సేవ, భద్రత, సస్టైనబిలిటీ రంగాల్లో డాక్టర్ కృష్ణ యెడుల చేసిన కృషి అనన్యమైనది. 1971లో హైదరాబాద్‌లో జన్మించిన ఆయన, ఉస్మానియా యూనివర్శిటీ నుంచి M.A., సింబయాసిస్ నుంచి MDBA, జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు.
2006లో సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (SCSC) స్థాపనలో కీలక పాత్ర పోషించిన ఆయన, సైబర్ సేఫ్టీ, మహిళల భద్రత, రోడ్ సేఫ్టీలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. కోవిడ్-19 సంక్షోభంలో *COVID కమాండ్ సెంటర్* ఏర్పాటు చేసి, 15 లక్షల భోజన ప్యాకెట్లు, 2 లక్షల కిరాణా కిట్లు, 18,000 ప్లాస్మా డొనేషన్లు, 200 బెడ్ ఐసోలేషన్ సెంటర్‌తో సహాయం అందించారు. ఒకే రోజు 38,000 మందికి వ్యాక్సిన్ వేయించి ప్రపంచ రికార్డు సృష్టించారు.
అనాథలు, వలస కూలీలు, ట్రాన్స్‌జెండర్లు, జంతువులకు సేవలందించి, కోవిడ్ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటారు. ఆయన సేవలకు గౌరవ డాక్టరేట్ (2024), ఇండియా రెస్పాన్సిబుల్ లీడర్ అవార్డ్ (2023) వంటి పురస్కారాలు లభించాయి.
Virtusaలో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తూనే, సమాజసేవలో స్థిరమైన పరిష్కారాలు అందిస్తూ, సస్టైనబిలిటీ, భద్రత, సహకారంతో సమాజానికి దిశానిర్దేశం చేస్తున్నారు డాక్టర్ యెడుల.