తెలంగాణ మాజీ హోంమంత్రి నాయని నరసింహారెడ్డి ఆరోగ్యం క్షీణించింది. ఇటీవల కరోనా భారినపడిన నాయని కోలుకుని ఇంటికెళ్లారు. రెండ్రోజుల క్రితం ఆకస్మాత్తుగా అనారోగ్యం పాలవటంతో హైదరాబాద్‌లోని ప్రయివేటు ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్టు వైద్యుల తెలిపారు. ఆయన త్వరగా కోలుకుని తిరిగి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన నాయిని తొలిసారి తెలంగాణ కేబినెట్‌లో హోంమంత్రిగా పనిచేశారు. కార్మికుల తరపున పోరాడుతున్నారు.



