హేమంత్ ఆర్ట్స్ పతాకంపై హేమంత్ ఇప్పలపల్లి రచన, దర్శకనిర్మాతగా వ్యవహరిస్తూ భారతదేశంలోనే అతిపెద్ద విఎఫ్ఎక్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం “ఫస్ట్ టైం”. నేడు విడుదలైన ఈ చిత్రంతో సౌరబ్ ధింగ్ర హీరోగా పరిచయం అవుతుండగా ‘బిగ్ బాస్’ ఫేమ్ అఖిల్ సార్థక్ సెకండ్ లీడ్ గా అనిక్క విక్రమన్ హీరోయిన్ గా ఇతర ముఖ్య పాత్రల్లో మైమ్ గోపి, శివ, భూపాల్ రాజు, గాయత్రి గుప్త, అన్నపూర్ణమ్మ, అజయ్ రత్నం, ఢీ పండు నటిస్తున్నారు. శ్రీ వెంకట్, సూరజ్ ఎస్ కురుప్ సంగీతాన్ని అందించగా వేణు మురళీధర్, రామ్ సినిమాటోగ్రాఫర్లుగా పనిచేశారు. ఇక ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…
కథ :
2304AD లో ఏలియన్స్ తో ప్రారంభమైన సినిమా అసలు ఈ కలియుగం ఎలా అంతమైంది కొత్త సృష్టి కొత్త భారత ప్రపంచం ఎలా తయారయింది అనే అంశంపై చిత్రీకరించబడింది. ఆ ఏలియన్లకు అప్పుడు సృష్టిలో ఉన్న మానవులు ఈ కలియుగంలో జరిగిన సంఘటనలు గురించి వివరిస్తూ ఒక పవిత్రమైన స్త్రీ కొత్త సృష్టికి ఎలా నాంది పలికింది అనే విషయాన్ని తెలియజేస్తారు. అనిక విక్రమన్ (హీరోయిన్) ని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి అని తన బావ భూపాల్ రాజు (విలన్), ఎలా అయినా దక్కించుకోవాలని శివకుమార్ రామచంద్రవరపు (విలన్), అఖిల్ సార్థక్ ప్రయత్నిస్తారు. అలాంటి సంఘటన నుంచి అనికా విక్రమన్ ఎలా తప్పించుకుంది? సౌరబ్ ధింగ్ర ను ఎలా కలుసుకుంది? కొత్త సృష్టి కొత్త భారత ప్రపంచం ఎలా తయారయింది? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. శ్రీ వెంకట్ అందించిన సంగీతం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి.
నటీనటుల నటన :
సౌరబ్ ధింగ్ర పరిచయమైన తొలి చిత్రం అయిన మంచి నటనను కనబరిచారు. అనిక విక్రమన్ నటన మరియు అందచందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. భూపాల్ రాజు శివకుమార్ అఖిల్ సార్థక్ ఎవరి పాత్రలో వారు ఒదిగిపోయారు. మైమ్ గోపి, అజయ్ రత్నం, అన్నపూర్ణమ్మ, గాయత్రి గుప్తా పాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
సాంకేతిక విశ్లేషణ :
ఈ ఫస్ట్ టైం మూవీ ని AI ని ఎక్కడ వాడకుండా HI హ్యూమన్ ఇంటలిజెన్స్ తో HI హేమంత్ ఇప్పలపల్లి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించే దర్శకత్వం వహించారు. తక్కువ బడ్జెట్ లో హైటెక్నికల్ వాల్యూస్ తో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక న్యూ ఏజ్ సినిమాను అందించారు. గతంలో వి ఎఫ్ ఎక్స్ అనుభవంతో చాలా గ్రాండ్ విజువల్స్ ని అందించారు. వేణు మురళీధర్ మరియు రామ్ సినిమాటోగ్రఫీ పనితీరు విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ : నటీనటుల నటన, సంగీతం, గ్రాండ్ విజువల్స్, సెకండ్ హాఫ్ లోని సన్నివేశాలు.
మైనస్ పాయింట్స్ : ఫస్టాఫ్ లో కొన్ని స్లో సన్నివేశాలు
ఫైనల్ వెర్డెక్ట్ : హై టెక్నికల్ వాల్యూస్ ఉన్న న్యూ ఏజ్ చిత్రంగా ఈ వేసవిలో ప్రేక్షకులను అలరించదగిన చిత్రం ఫస్ట్ టైం.
రేటింగ్ : 3/5



